Hijab Row:ఉడిపిలో ఈ నెల 14 నుండి 19 వరకు 144 సెక్షన్

Published : Feb 13, 2022, 11:24 AM ISTUpdated : Feb 13, 2022, 11:32 AM IST
Hijab Row:ఉడిపిలో ఈ నెల 14 నుండి 19 వరకు 144 సెక్షన్

సారాంశం

హిజాబ్ ఆందోళనల నేపథ్యంలో ఉడిపిలోని అన్ని స్కూల్స్ , కాలేజీల వద్ద ఈ నెల 14 నుండి 19వ తేదీ వరకు 144 సెక్షన్ ను అమల్లోకి తీసుకొచ్చారు.

బెంగుళూరు:కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపిలో ఈ నెల 14 నుండి 19వ తేదీ వరకు 144 section విధిస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం నాడు ప్రకటించింది. హిజాబ్ ఆందోళనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది.

ఉడిపిలోని అన్ని ఉన్నత పాఠశాలల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లోకి తీసుకొచ్చామని అధికారులు తెలిపారు.జ ఈ నెల 14వ తేదీ ఉదయం 6 గంటల నుండి ఈ నెల 19వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు.

పోలీస్ సూపరింటెండ్ ఉడిపిలోని డిప్యూటీ కమిషనర్ కూర్మారావుకు వినతి పత్రం ఇవ్వడంతో 144 సెక్షన్ విధించారు. జిల్లాలోని హైస్కూల్స్ చూట్టూ 200 మీటర్ల పరిధిలో ఆంక్షలు అమలు చేయనున్నారు. అంతకుముందే బెంగుళూరులోని స్కూల్స్, కాలేజీల పరిసర ప్రాంతాల్లో కూడా ఆంక్షలు అమల్లోకి తీసుకొచ్చారు. బెంగుళూరులోని స్కూల్స్, కాలేజీలతో పాటు ఇతర విద్యా సంస్థల చుట్టూ క్రిమినల్ పోసీజర్  సెక్షన్ 144 సెక్షన్ ఈ నెల 22 వరకు అమల్లో ఉంటుంది. కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో హిజాబ్ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకొన్నారు.

గ‌త‌నెల‌లోUdupiలోని ప్రభుత్వ college లో ఈ వివాదం ప్రారంభ‌మైంది. ఆరుగురు విద్యార్థినీలు నిర్దేశించిన దుస్తుల కోడ్‌ను ఉల్లంఘించి Hijabలు ధరించి తరగతులకు వచ్చారు. తర్వాత నగరంలోని మరికొన్ని కళాశాలల్లో సమీపంలోని కుందాపూర్, బిందూర్‌లలో కూడా ఇలాంటి సంఘటనలు నమోదయ్యాయి. ఈ ఆంశానికి వ్య‌తిరేకంగా ఓ వర్గం విద్యార్థులు కాషాయ కండువాలు ధ‌రించి క‌ళాశాల‌కు ప్ర‌వేశించారు. తాము కండువా ధరించి వ‌స్తామ‌ని తెలిపారు. కానీ వ్య‌తిరేకించ‌డంతో  తమను తరగతుల నుండి నిషేధించారని ఆరోపించడంతో  నిరసనలు ప్రారంభించారు. ఉడిపి, చిక్ మంగళూరులోని రైట్‌వింగ్ గ్రూపులు ముస్లిం బాలికలు హిజాబ్ ధరించడాన్ని వ్యతిరేకించాయి. ఈ నిరసనలు ఉడిపిలో ఉన్న మరిన్ని కళాశాలలకు వ్యాపించాయి.

ఈ క్ర‌మంలో  ఫిబ్రవరి 8  ఉడిపిలోని ఒక ప్రభుత్వ కళాశాలలో ఇన్‌స్టిట్యూట్‌లో హిజాబ్‌ను నిషేధించిన ఉత్తర్వులను సవాలు చేస్తూ High Courtలో  పిటిష‌న్ దాఖాలు చేశారు. ఈ పిటిషన్‌లను కర్ణాటక హైకోర్టు విచారించింది.. స్కూల్ అడ్మినిస్ట్రేషన్ డిక్రీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ను ఉల్లంఘించడమేనని దాని ప్రకారం మత స్వేచ్ఛ ఉందని విద్యార్థి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ విషయమై కర్ణాటక హైకోర్టు ధర్మాసనం మధ్యంతర తీర్పును ఇచ్చింది.వివాదం కోర్టులో పెండింగ్‌లో ఉన్నప్పుడు ఏ విద్యార్థి కూడా మతపరమైన దుస్తులు ధరించాలని పట్టుబట్టకూడదని ధర్మాసనం అభిప్రాయపడింది. అనంతరం విచారణను  ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది.

అయితే ఈ మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ ను దాఖలైంది. అయితే ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.ఈ అంశాన్ని జాతీయ సమస్యగా చిత్రీకరించొద్దని కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.కర్ణాటక రాష్ట్రంలో ప్రారంభమైన హిజాబ్ వివాదం ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరిస్తోంది.  హిజాబ్  కు మద్దతుగా తెలంగాణ రాష్ట్రంలోని పాతబస్తీలో విద్యార్ధినీలు ఆందోళనలు నిర్వహించారు.  పుదుచ్చేరిలోని అరియాంకుప్పంలోని ప్రభుత్వ పాఠశాలలో ఓ టీచ‌ర్ తరగతిలో విద్యార్థి హిజాబ్ వేసుకొని రావ‌డంతో అభ్యంతరం వ్య‌క్తం చేశారు. దీనిపై ఆందోళ‌న వ్య‌క్తం అవుతోంది. అలాగే మ‌ధ్య ప్ర‌దేశ్ లో విద్యాశాఖ మంత్రి హిజాబ్ పై వ్యాఖ్య‌లు చేశారు. దీంతో అక్క‌డి ప్ర‌తిప‌క్షం ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు గుప్పించింది. 

 

PREV
click me!

Recommended Stories

Attari-Wagah Border Republic Day:భారత్- పాక్ సరిహద్దుల్లో నరాలు తెగిపడే ఉత్కంఠ | Asianet News Telugu
Republic Day Celebration at Attari–Wagah Border: అబ్బురపరిచే సైనిక విన్యాసాలు | Asianet News Telugu