
కొందరు ముస్లిం బాలికలు బురఖా ధరించి తరగతులకు హాజరవుతున్నారని మంగళూరు యూనివర్సిటీ కాలేజీకి చెందిన విద్యార్థుల బృందం చేసిన నిరసనతో కర్ణాటకలో హిజాబ్ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. హిందూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. తాము కూడా కాషాయ వస్త్రాలు, కాషాయ సఫా ధరించి క్లాస్‌కు హాజరవుతామని ప్రకటించారు. ఈ తాజా వివాదంపై సీఎం బసవరాజ్ బొమ్మై స్పందించారు.
‘‘ ఈ సమస్యను ప్రత్యేకంగా లేవనెత్తాల్సిన అవసరం లేదు. కోర్టు ఇప్పటికే తన తీర్పును వెలువరించింది. ప్రతీ ఒక్కరూ దీనిని అనుసరిస్తున్నారు. 99.99 శాతం మంది కోర్టు తీర్పును పాటిస్తున్నారు. వారు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని పాటించాల్సిందే ’’ అని సీఎం బసవరాజ్ బొమ్మై మీడియాతో తెలిపారు.
Aryan Khan drug case: డ్రగ్ కేసులో ఆర్యన్ ఖాన్ కు క్లీన్ చిట్ పై చిదంబరం కీలక వ్యాఖ్యలు
దాదాపు 44 మంది విద్యార్థులు హిజాబ్ ధరించి కళాశాలకు వస్తున్నారని, వారిలో కొందరు తరగతి గదుల్లో కూడా అలాగే చేస్తున్నారని పేర్కొంటూ విద్యార్థులు క్యాంపస్ లో నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఈ విషయం మరో సారి చర్చలోకి వచ్చింది. అయితే కళాశాల క్యాంపస్ లో మే 16వ తేదీన ఓ సర్కులర్ జారీ చేశారు. దీని ప్రకారం క్యాంపస్ లోపల హిజాబ్ లేదా బురఖాపై ధరించకుండా నిషేధం విధించారు. కానీ ఆ సర్కులర్ విడుదల అయిన కొన్ని రోజులకే ఈ వివాదం మళ్లీ మొదలైంది. నిరసన సమయంలో స్టూడెంట్లు మాట్లాడుతూ.. హిజాబ్ పై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయడంలో కళాశాల విఫలమైందని ఆరోపించారు.
అమ్మాయి అనుకుని పెళ్లి చేసుకున్నాడు.. రిసెప్షన్ సయమానికల్లా ఖంగుతిన్న వరుడు
మొట్ట మొదట ఈ వివాదం ఈ ఏడాది జనవరి-ఫిబ్రవరి నెలలో కర్ణాటకలోని ఉడిపి జిల్లాలోని ప్రభుత్వ బాలికల పీయూ కళాశాలలో వెలుగులోకి వచ్చింది. పలువురు ముస్లిం కమ్యూనిటీకి చెందిన విద్యార్థిణులు హిజాబ్ ధరించి కళాశాలకు వచ్చారు. అయితే దీనిని కళాశాల యాజమాన్యం ఒప్పుకోలేదు. దీంతో వివాదం మొదలైంది. ఆ సమయంలో ఇది దేశ వ్యాప్తంగా చర్చనీయాశం అయ్యింది. ఇలాంటి ఘటనలు పలు రాష్ట్రాల్లో కూడా వెలుగులోకి వచ్చాయి. కొన్ని దేశాలు కూడా ఈ అంశంలో తలదూర్చాయి.
సీమా ఇక రెండు కాళ్లతో బడికెళ్తుంది.. ఇదీ సోషల్ మీడియా పాజిటివ్ పవర్..
ఈ వివాదం చెలరేగడంతో ఉడిపిలోని ప్రీ-యూనివర్శిటీ కాలేజీల్లో చదువుతున్న ముస్లిం బాలికలు తరగతి గదుల్లో హిజాబ్ ధరించే హక్కును కల్పించాలని కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ కేసును పలు విడతల్లో కోర్టు విచారించింది. చివరికి విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్లు హైకోర్టు మార్చి 16న కొట్టివేసింది. ఈ సందర్భంగా పలు వ్యాఖ్యలు చేస్తూ తీర్పును వెలువరించింది. హిజాబ్ ధరించడం ఇస్లాంలో ఖచ్చితమైన మతపరమైన ఆచారం కాదని తెలిపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం మత స్వేచ్ఛ సహేతుకమైన పరిమితులకు లోబడి ఉంటుందని హైకోర్టు పూర్తి స్థాయి ధర్మాసనం పేర్కొంది. యూనిఫాంలు ధరించాలని, హిజాబ్ ధరించడాన్ని పరిమితం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 5న జారీ చేసిన ఉత్తర్వులను కూడా కోర్టు సమర్థించింది.