Karnataka hijab row: హిజాబ్ వివాదం.. క‌ర్నాట‌క విద్యాశాఖ ముందు మ‌రో స‌వాల్ !

Published : Mar 26, 2022, 10:38 AM IST
Karnataka hijab row:  హిజాబ్ వివాదం.. క‌ర్నాట‌క విద్యాశాఖ ముందు మ‌రో స‌వాల్ !

సారాంశం

Karnataka hijab row: విద్యాసంస్థ‌ల్లో హిజాబ్ ధ‌రించి హాజ‌రుకావ‌డంపై నిషేధం కొన‌సాగుతోంది. అయితే, ప‌రీక్ష‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో క‌ర్నాట‌క విద్యాశాఖ‌కు ఇది మ‌రో స‌వాలుగా మారింది.   

Karnataka hijab row: గత రెండేళ్లలో కోవిడ్ మహమ్మారి సమయంలో బోర్డు పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన క‌ర్నాట‌క‌ విద్యాశాఖ ఇప్పుడు హిజాబ్ సమస్యను ఎదుర్కొంటోంది. క‌ర్నాట‌క‌ హైకోర్టు ప్రత్యేక బెంచ్ తీర్పు నేపథ్యంలో.. హిజాబ్ ధరించిన విద్యార్థులను పరీక్షలకు అనుమతించకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు పరీక్షా కేంద్రాల దగ్గర గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన SSLC (10వ తరగతి) పరీక్షలను మార్చి 28 నుండి నిర్వహిస్తోంది. ఈ ప‌రీక్ష‌లు ఏప్రిల్ 11 వరకు జ‌ర‌గ‌నున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో 8,73,846 మంది విద్యార్థులు SSLC పరీక్షలకు హాజ‌రుకావ‌డానికి నమోదు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3,444 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామనీ, వాటి పరిసర ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు కఠినతరం చేస్తామని అధికారులు చెప్పారు.

గత రెండు సంవత్సరాల నుండి, ఉపాధ్యాయ సోదరభావం విపరీతమైన ఒత్తిడిలో ఉంది. కోవిడ్ మహమ్మారి సమయంలో ఉపాధ్యాయులు తమ జీవితాలను పణంగా పెట్టి పనిచేశారు. బోర్డు పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులందరూ ఉత్తీర్ణత సాధించినప్పటికీ.. సంబంధిత‌ డిపార్ట్‌మెంట్ చొరవ ప్రశంసించద‌గింది. ఎందుకంటే కోవిడ్ బాధిత విద్యార్థులకు పరీక్షలు రాయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీనికి తోడు ఉపాధ్యాయులు కూడా కోవిడ్ సంబంధిత పని కోసం ఉపయోగించబడ్డారు. ఈ ప్రక్రియలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు, హిజాబ్ సమస్య కూడా ఉపాధ్యాయుల‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతూ.. ఒత్తిడిని కలిగిస్తుందని విద్యా శాఖ వర్గాలు చెబుతున్నాయి.

అయితే, హిజాబ్‌పై హైకోర్టు ఆదేశాలను పిటిషనర్ విద్యార్థులు సుప్రీంకోర్టులో సవాలు చేస్తున్నారు. విద్యార్థులు హిజాబ్ ధరించి పరీక్షలు రాయడానికి అనుమతించాలని ప్రతిపక్ష కాంగ్రెస్ అధికార బీజేపీని గట్టిగా డిమాండ్ చేస్తోంది. యూనిఫామ్‌తో దుపట్టా మ్యాచింగ్‌తో ఉన్న ముస్లిం విద్యార్థులను పరీక్ష హాలులోకి అనుమతించాలని ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య డిమాండ్ చేశారు. హిందూ, జైన మహిళలు, మత పెద్దలు ముఖానికి గుడ్డ కట్టుకుంటే ముస్లిం విద్యార్థులు ఎందుకు చేయకూడదు? అని ప్ర‌శ్నించారు. ఇది కాస్తా వివాదాస్ప‌ద‌మైంది. అయితే, తనకు మత పెద్దలపై చాలా గౌరవం ఉందని, వారిని కించపరచడం తన ఉద్దేశ్యం కాదని సిద్ధ‌రామ‌య్య స్పష్టం చేశారు.

కోర్టు తీర్పును అనుసరించి ప్రభుత్వ ఆదేశాల తర్వాత కూడా విద్యార్థులు హిజాబ్ ధరించి పరీక్షలు రాయడానికి ప్రయత్నిస్తారని, వాటిని ఆపినప్పుడు పరీక్షా కేంద్రాల దగ్గర గందరగోళం ఏర్పడుతుందని పోలీసు శాఖ వర్గాలు తెలిపాయి. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా పరిస్థితిని సక్రమంగా నిర్వహించాలని వారు అంటున్నారు. హిజాబ్ ధరించిన విద్యార్థులను పరీక్షలకు అనుమతించేది లేదని, ఇందులో రెండో ఆలోచన లేదని విద్యాశాఖ మంత్రి బీసీ నగేష్ స్పష్టం చేశారు. "మేము హిజాబ్ ఉన్న విద్యార్థులను బోర్డు పరీక్షలతో సహా ఏ పరీక్షలకు అనుమతించము," అని అతను చెప్పాడు. విద్యా శాఖ అన్ని సబ్జెక్టులకు ప్రీ-కోవిడ్ నమూనా మాదిరిగానే ప్రత్యేక పరీక్షలను నిర్వహిస్తోంది. విద్యార్థులు ఈసారి కనీస ఉత్తీర్ణత మార్కులను పొందవలసి ఉంటుంది. 

విద్యార్థులకు కోవిడ్ నిబంధనలు సడలించబడ్డాయి. పరీక్ష హాల్‌లలో మాస్క్ ధరించడం తప్పనిసరి కాదు. అయితే, పరీక్ష హాల్‌లను శానిటైజ్ చేయడంతోపాటు సామాజిక దూరం పాటిస్తారు.  తకుముందు, తరగతి గదుల్లో హిజాబ్ ధరించడానికి అనుమతి కోరుతూ దాఖలైన పిటిషన్లను కర్ణాటక హైకోర్టు ప్రత్యేక బెంచ్ కొట్టివేసింది. హిజాబ్ ధరించడం ఇస్లాంలో ముఖ్యమైన భాగం కాదని కూడా పేర్కొంది.

PREV
click me!

Recommended Stories

Putin India Tour: భారత్ లో అడుగుపెట్టిన పుతిన్ సెక్యూరిటీ చూశారా? | Modi Putin | Asianet News Telugu
Putin Tour: భారత్‌కి పుతిన్‌ రాక.. వారణాసిలో దీపాలతో స్వాగతం | Vladimir Putin | Asianet News Telugu