పాక్‌లో భారత క్షిపణి పేలుడు: దర్యాప్తునకు ఆదేశించామన్న రాజ్‌నాథ్ సింగ్

Published : Mar 15, 2022, 01:34 PM IST
పాక్‌లో భారత క్షిపణి పేలుడు: దర్యాప్తునకు ఆదేశించామన్న రాజ్‌నాథ్ సింగ్

సారాంశం

పాకిస్థాన్ లో భారత్ క్షిపణి  పొరపాటున  పేలడంపై   రాజ్యసభలో కంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం నాడు ప్రకటన చేశారు.

న్యూఢిల్లీ: ఈ నెల 9వ తేదీన ప్రమాదవశాత్తు Pakistan భూభాగంలో భారత్ Missile  పేలుడు అంశంపై అత్యున్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్టుగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.

మంగళవారం నాడు రాజ్యసభలో ఈ విషయమై Rajnath Singh ప్రకటన చేశారరు. భారత క్షిపణి వ్యవస్థ అత్యంత సురక్షితమైందన్నారు.ఈ నెల 9వ తేదీన క్షిపణి యూనిట్ సాధారణ నిర్వహణ తనిఖీలు చేస్తున్న సమయంలో సాయంత్రం ఏడు గంటల సమయంలో అనుకోకుండా ఓ క్షిపణి విడుదలైందని మంత్రి  చెప్పారు.  ఈ విషయాన్ని ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుందన్నారు.  క్షిపణి ఎలా ప్రయోగించబడిందనే విషయమై విచారణకు ఆదేశించామని మంత్రి తెలిపారు. ఈ క్షిపణి పాక్ భూభాగంలో పడిందన్నారు. ఈ ఘటన దురదృష్టకరమైందిగా మంత్రి చెప్పారు.   ఈ క్షిపణి ప్రయోగంతో ఎలాంటి నష్టం జరగలేదని మంత్రి వివరించారు.

తమ కార్యకలాపాలు, నిర్వహణ, తనిఖీలు మూల్యాంకనం చేయబడే ప్రామాణిక ఆపరేటింగ్ విధాల పరిమితిని అనుసరించి నిర్వహిస్తామన్నారు.  ఆయుధ వ్యవస్థల భద్రత, భద్రతలో ఏమైనా అలసత్వం ఉంటే వాటిని పరిష్కరిస్తామన్నారు. ఈ తరహా వ్యవస్థలను నిర్వహించడంలో తమ సాయుధ బలగాలకు మంచి అనుభవం ఉందని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

EPI 2024 లో అద్భుత ర్యాంకు సాధించిన యూపీ.. అసలు ఇదేమిటో తెలుసా?
Budget : ఆ ఒక్క బడ్జెట్ దేశ జాతకాన్నే మార్చేసింది.. డ్రీమ్ బడ్జెట్ అసలు కథ ఇదే !