
కేరళ : ఇద్దరు అమ్మాయిలు కలిసి జీవించొచ్చని kerala high court స్పష్టం చేసింది. తల్లిదండ్రులు వీరిద్దరు కలిసి ఉండడానికి అడ్డు చెప్పడాన్ని తోపి పుచ్చింది. Saudi Arabiaలో చదువుకునే సమయంలో అదిలా, ఫాతిమా మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తరువాత అది ప్రేమగా మారింది. కొద్ది రోజులకు సహజీవనం ప్రారంభించారు. దీనికి వారి కుటుంబ సభ్యులు అడ్డు చెప్పారు. ‘మే 19న నేను కోజికోడ్ కు వెళ్లి ఫాతిమాను కలిశాను. అక్కడి షెల్టర్ హోం లో మేం ఆశ్రయం తీసుకున్నాం. కానీ మా బంధువులు మమ్మల్ని గుర్తించడం వల్ల పోలీసులు కలగజేసుకున్నారు’ అని అదిలా తన పిటిషన్ లో పేర్కొంది.
అదిలా బంధువులు ఆమెతో పాటు ఫాతిమాను అలువలోని తమ ఇంటికి తీసుకెళ్లిపోయారు. ఆ తరువాత కొద్ది రోజులకు ఫాతిమా బంధువులు అలువకు వచ్చి ఆమెను బలవంతంగా లాక్కెళ్లారు. దీంతో అదిలా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆ తరువాత హై కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది.
ఇదిలా ఉండగా.. ఇదిలా ఉండగా ఇటీవల ఇలా అమ్మాయిల్ని అమ్మాయిలే పెళ్లి చేసుకునే ఘటనలు చాలానే వెలుగు చూస్తున్నాయి. ఈ ఫిబ్రవరిలో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇద్దరు అమ్మాయిలు గొడవపడి పోలీస్ స్టేషన్ కు చేరిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకొంది. అయితే ఈ ఇద్దరు అమ్మాయిలు వివాహం చేసుకొన్న విషయం పోలీస్ స్టేషన్ వరకు చేరడంతో రెండు కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
ఒంగోలు పట్టణానికి చెందిన ఇద్దరు యువతులు ప్రేమ పెళ్ళి చేసుకున్నారు. ఈ విషయమై ఇంట్లో చెప్పారు. దీంతో ఇరు కుటుంబ సభ్యులు షాక్ కు గురయ్యాయరు. అంతేకాదు వీరి ప్రేమ పెళ్లికి అభ్యంతరం తెలిపారు. ఒకవైపు తల్లిదండ్రుల అభ్యంతరాలు కొనసాగుతుండగానే మరోవైపు ఈ యువతులు ఇద్దరూ ఒంగోలు కలెక్టరేట్ ఎదుట గొడవపడ్డారు. యువతులు ఇద్దరూ గొడవ పడటాన్ని గమనించిన ఓ మహిళా కానిస్టేబుల్ ఒంగోలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఇద్దరు యువతులతో పాటు వారి తల్లిదండ్రులను కూడా పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇద్దరు రెండు నెలలుగా కలిసి తిరుగుతున్నారని పోలీసులు చెప్పారు. అయితే ఇద్దరం కలిసి ఉంటామంటూ ఇద్దరు యువతులు పేర్కొన్నారు. అంతేకాదు ఈ ఇద్దరు మరో రకమైన వాదనను కూడా పోలీసుల ముందుకు తీసుకొచ్చారని సమాచారం. ఈ ఇద్దరిలో ఓ అమ్మాయికి మేనమామతో వివాహం నిశ్చయం చేశారు. అయితే ఈ వివాహం ఇష్టం లేని యువతి మరో యువతితో కలిసి ఉంటుంది.
ఇద్దరం కలిసి ఒకే రూమ్ లో ఉంటూ చదువుకొంటున్నామని తెలిపింది. తమ మధ్య ఎలాంటి సంబంధం లేదని కూడా చెప్పారని ప్రచారం కూడా సాగుతుంది. అక్కా చెల్లెళ్ల మాదిరిగా కలిసి జీవిస్తున్నామని తెలిపారు. యితే టిక్ టాక్ కోసమే తాము పెళ్లి చేసుకొన్నట్టుగా నటించామని ఓ యువతి తెలిపినట్టుగా ప్రచారం సాగుతుంది. ఈ వీడియోలను చూసి తాము నిజంగానే పెళ్లి చేసుకొన్నట్టుగా భ్రమ పడుతున్నారని ఓ యువతి పోలీసులకు వివరించినట్టుగా తెలుస్తోంది.