
KS Eshwarappa: జాతీయ జెండా పై బీజేపీ నేత, కర్నాటక మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అతనిపై కేసు నమోదు చేసింది. అరెస్ట చేయాలని డిమాండ్ చేస్తుంది. జాతీయ జెండా పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నాయకుడు, మాజీ కర్ణాటక మంత్రి ఈశ్వరప్ప ను అరెస్టు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నాయకుడు సంజయ్ సింగ్ డిమాండ్ చేశారు
‘‘ఏదో ఒకరోజు కాషాయ జెండా.. భారత జాతీయ జెండా అవుతుందని, జాతీయ జెండాను అవమానించినందుకు ఈశ్వరప్పపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఫిర్యాదు చేశాను. 50 ఏళ్లకు పైగా ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేయలేదు. నిజానికి.. జాతీయ జెండాను బీజేపీ వ్యతిరేకిస్తోంది’’ అని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సంజయ్ సింగ్ అన్నారు. ఈశ్వరప్ప వ్యాఖ్యలకు గాను ఆయనను అరెస్టు చేయాలని ఆయన అన్నారు. ఈ మేరకు ఢిల్లీలోని నార్త్ అవెన్యూ పోలీస్ స్టేషన్‌లో ఈశ్వరప్పపై ఫిర్యాదు చేశారు.
కాషాయంపై గౌరవం ఈ రోజు మొదలైంది కాదు...: కేఎస్ ఈశ్వరప్ప
బీజేపీ నేత ఈశ్వరప్ప మంగళవారం మీడియాతో మట్లాడుతూ.. ఏదో ఒక రోజు, కాషాయ జెండా దేశానికి జాతీయ జెండా అవుతుందని అన్నారు. కాషాయంపై గౌరవం ఈరోజు మొదలైంది కాదు, వేల ఏండ్లుగా గౌరవం ఉంది. కాషాయ జెండా త్యాగానికి చిహ్నం...రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) జెండా ఎప్పుడో ఒకప్పుడు జాతీయ జెండా అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని సంచలన వ్యాఖ్యాలు చేశారు. అలాగే.. 36000 ఆలయాలను తిరిగి స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. కాగా, మంత్రి ఈశ్వరప్ప తనను ముడుపులు డిమాండ్ చేశాడని ఆరోపించిన కాంట్రాక్టర్ మరణించిన ఉదంతంలో ఈశ్వరప్పను క్యాబినెట్ నుంచి తప్పించారు.
గతంలోనూ ఈశ్వరప్ప వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. ఈ ఏడాది ఫిబ్రవరిలో కర్ణాటక అసెంబ్లీలో మాట్లాడుతూ.. తాము ఎర్రకోట సహా ప్రతిచోటా కాషాయ జెండాను ఎగురవేస్తామని, భారత్ త్వరలోనే హిందూ దేశంగా అవతరిస్తుందని అన్నారు. ఈశ్వరప్ప వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దూమారం రేగింది. కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. అసెంబ్లీ లోపల వెలుపల పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. జాతీయ జెండాను అవమానించినందుకు ఆయన రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశారు.