భారత్‌లో కోవిడ్ రోగుల కోసం ‘ ఫవివిర్ ’: ఒక్కో మాత్ర రూ.59, విడుదల చేసిన హెటిరో

By Siva KodatiFirst Published Jul 29, 2020, 8:52 PM IST
Highlights

కరోనా కష్టకాలంలో భారతీయ ఫార్మా రంగం ప్రపంచ దేశాలకు సంజీవనీగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అనేక దేశాలకు హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలతో పాటు ఎన్నో రకాల డ్రగ్స్‌ను భారత్ ఎగుమతి చేసింది

కరోనా కష్టకాలంలో భారతీయ ఫార్మా రంగం ప్రపంచ దేశాలకు సంజీవనీగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అనేక దేశాలకు హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలతో పాటు ఎన్నో రకాల డ్రగ్స్‌ను భారత్ ఎగుమతి చేసింది.

ఈ క్రమంలో మనదేశంలో దిగ్గజ  ఫార్మా కంపెనీ హెటిరో కోవిడ్ రోగుల కోసం ‘ఫవిపిరవిర్’’ అనే ఔషధాన్ని భారతదేశంలో విడుదల చేసింది. దీనిని ‘‘ ఫవివిర్’ పేరుతో విక్రయించనుంది.

ఫవిఫిరవిర్ తయారీ, మార్కెటింగ్ కోసం హెటిరోకు భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీజీసీఐ) అనుమతులు ఇచ్చింది. కాగా కరోనా రోగుల కోసం ఇది వరకే కోవిఫర్ (రెమ్డి‌సివిర్)ను హెటిరో అభివృద్ధి చేసింది.

Also Read:మరో ముగ్గురికి కరోనా: స్వీయ నిర్భంధంలోకి గవర్నర్

ఫవివిర్ ఈ క్రమంలో రెండో ఔషధం. ఇది నోటి ద్వారా తీసుకునే వైరస్ నిరోధక మాత్ర. ఈ మాత్రలపై నిర్వహించిన క్లినికల్ ప్రయోగాల్లో సంతృప్తికర ఫలితాలు వచ్చాయి. స్వల్ప స్థాయి నుంచి మోస్తరుస్థాయి లక్షణాలు ఉన్న కోవిడ్ 19 బాధితుల చికిత్స కోసం ఈ ఔషధం ఉపయోగపడుతుంది.

ఒక్కో మాత్ర ధర రూ.59. దీనిని హెటిరో హెల్‌కేర్ లిమిటెడ్ మార్కెట్‌లో విక్రయిస్తుంది. దేశవ్యాప్తంగా అన్ని ఔషధ దుకాణాల్లో, ఆసుపత్రుల్లో బుధవారం నుంచి ఈ మాత్రలు అందుబాటులో ఉంటాయి. వీటిని కొనుగోలు చేయాలంటే డాక్టర్ ప్రిస్కిప్షన్ తప్పనిసరి. 

click me!