రూ.40 చోరీ.. : ఏడేళ్ల జైలు శిక్ష తప్పదు, ఎందుకో తెలుసా..!!!

By Siva KodatiFirst Published Jul 29, 2020, 4:00 PM IST
Highlights

రూ.40 రూపాయలను దొంగతనం చేసినందుకు ఓ వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం వుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం.

రూ.40 రూపాయలను దొంగతనం చేసినందుకు ఓ వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం వుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం. వివరాల్లోకి వెళితే.. ముంబై నగరంలోని ఫోర్ట్ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ మింట్‌లోని లాకర్ నుంచి రూ.40 దొంగతనం చేశాడు.

దీనిని గమనించిన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై కేసు నమోదు చేశారు. . అతను దొంగతనం చేసినవి త్వరలో విడుదల కాబోతున్న 20 రూపాయల నాణేలు. నిందితుడిని ఆర్ఆర్ చబుక్షర్‌గా గుర్తించారు.

కాగా అతను ప్రభుత్వ మింట్ నుంచి తొలిసారి చోరీ చేశాడా..? లేక గతంలోనూ చోరీలకు పాల్పడ్డాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చోరీకి గురైన నాణేలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. చబుక్షర్‌పై ఐపీసీ సెక్షన్ 381 కింద కేసు నమోదు చేశారు.

దీని ప్రకారం నిందితుడికి ఏడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం వుంది. 2019 మార్చిలో ప్రధాని నరేంద్రమోడీ విడుదల చేసిన పలు నాణేల్లో రూ.20 నాణేం కూడా వుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ నాణేం విడుదల కావాల్సి వుండగా.. కరోనా కారణంగా వాయిదా పడింది.

చబుక్షర్ నాణేలను చోరీ చేసినా రోజువారీ తనిఖీలతో వాటిని బయటకు తీసుకువెళ్లలేదని అధికారులు తెలిపారు. మరోవైపు కరోనా కారణంగా నిందితుడిని ఇంకా అదుపులోకి తీసుకోలేదని, దర్యాప్తుకు సహకరించాలని నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు. 

click me!