
న్యూఢిల్లీ: అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. రాజీవ్ గాంధీకే రాహుల్ గాంధీ పుట్టాడా? అని బీజేపీ ఎప్పుడైనా ప్రూఫ్‌లు అడిగిందా అని హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ వ్యాఖ్యలను తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా తప్పుపట్టారు. దీంతో హిమంత బిశ్వ శర్మ కూడా మరో సారి తన వ్యాఖ్యలను సమర్థించుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ గొడవ తెలంగాణ సీఎం కేసీఆర్, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మల మధ్య గొడవగా మారింది. ఈ వాగ్వాదంలో మరో అడుగు ముందుకు వేసి హిమంత బిశ్వ శర్మ మరోసారి సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
పాకిస్తాన్‌పై 2016లో జరిపిన మెరుపుదాడులను కాంగ్రెస్ తరుచూ చిన్నదిచేసి చూపే ప్రయత్నం చేస్తుందని, అసలు దాడులు జరిగినట్టు ఆధారాలు ఏమి ఉన్నాయని కాంగ్రెస్ అడుగుతుందని శర్మ గతంలో పేర్కొన్నారు. ఇలా జవాన్ల పోరాటాలకు ప్రూఫ్‌లు అడగటం వారి త్యాగాలను పరిహసించడమేనని, ఆర్మీని అవమానించడమేనని విమర్శించారు. ఆర్మీ ప్రాణాలను పణంగా పెట్టి సర్జికల్ స్ట్రైక్స్ చేస్తే వాటిక ప్రూఫ్‌లు అడుగుతారా? రాహుల్ గాంధీ.. రాజీవ్ గాంధీకే పుట్టాడని బీజేపీ ఎప్పుడైనా ప్రూఫ్‌లు అడిగిందా? అని ఎదురు ప్రశ్నించారు.
Koo AppDear KCR garu, here is the videographic evidence of the surgical strike by our brave army. In spite of this you question the valor of our Armed forces and insult them. Why are you so desperate to attack and malign our Army? New India will not tolerate insults against our Army.- Himanta Biswa Sarma (@himantabiswa) 14 Feb 2022
రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. సీఎం కేసీఆర్ రాహుల్ గాంధీ వైపు నిలబడి బీజేపీ దిగజారి వ్యాఖ్యలు చేస్తున్నదని మండిపడ్డారు. సర్జికల్ స్ట్రైక్స్ ప్రూఫ్‌లు అడగటంలో తప్పేం ఉన్నదని ప్రశ్నించారు. ఆయనే కాదు.. తాను కూడా అడుగుతున్నారని, ఆ మెరుపుదాడులకు ఆధారాలను కేంద్ర ప్రభుత్వం చూపెట్టాలని డిమాండ్ చేశారు. అది కేంద్ర ప్రభుత్వం బాధ్యత అని పేర్కొన్నారు. బీజేపీ ఎప్పుడూ దుష్ప్రచారం చేస్తూ ఉంటుంది కాబట్టి.. అది చేసే ప్రకటనలను అందరూ నమ్మకపోవచ్చునని.. అందుకే వారిని కొందరు ఆధారాలు కావాలని అడుగుతున్నారని చెప్పారు. ఇది ప్రజాస్వామ్యం.. మీరు రాజు కాదు అంటూ చురకలు అంటించారు.
ఈ వ్యాఖ్యలకు సమాధానంగా హిమంత బిశ్వ శర్మ సోషల్ మీడియాలో ‘కూ’లో ఓ వీడియోను పోస్టు చేశారు. అదే పోస్టులో తన వ్యాఖ్యలను ఇలా జోడించారు. డియర్ కేసీఆర్ గారు.. మన వీర జవాన్లు చేపట్టిన సర్జికల్ స్ట్రైక్‌కు సంబంధించిన వీడియోగ్రఫిక్ ఎవిడెన్స్ ఇవే. ఇలాంటి ఆధారాలు ఉన్నప్పటికీ మన భద్రతా బలగాల శూరత్వాన్ని ప్రశ్నించారు. వారిని అవమానపరిచారు. మన భారత ఆర్మీపై దాడి చేసే పని.. ఆర్మీ ప్రతిష్టను దిగజార్చడానికి ఎందుకు పూనుకున్నారని ప్రశ్నించారు. నూతన భారతం ఆర్మీని అవమానించడం సహించదని పేర్కొన్నారు.
రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్థించుకున్నారు. ‘భారత దేశానికి వ్యతిరేకంగా మాట్లాడొచ్చు.. కానీ, గాంధీ కుటుంబానికి వ్యతిరేకంగా మాట్లాడరాదా? కాంగ్రెస్ పార్టీ దేశంలో ఇలాంటి వాతావరణాన్ని తయారు చేసింది’ అని ఆరోపణలు గుప్పించారు. భారత బలగాల వైపు నిలబడటం తప్పా? అంటూ ప్రశ్నించారు. వారి దేశ భక్తిని ప్రశ్నించడం సరికాదని పేర్కొన్నారు. దేశం కోసం వారేం చేశారో చెప్పాలని ప్రూఫ్‌లు అడక్కండి అంటూ కాంగ్రెస్‌పై మండిపడ్డారు. దేశాన్ని వ్యతిరేకించినా.. గాంధీ కుటుంబాన్ని వ్యతిరేకించరాదనే వాతావరణాన్ని కాంగ్రెస్ పార్టీ దేశంలో తయారు చేసి పెట్టిందని ఆరోపించారు.