హత్య చేసి హర్ట్ అటాక్ గా క్రియేట్.. మూడు నెలల తరువాత.. కాల్ రికార్డింగ్ తో బయటపడ్డ మర్డర్ మిస్టరీ 

Published : Nov 17, 2022, 04:40 PM IST
హత్య చేసి హర్ట్ అటాక్ గా క్రియేట్.. మూడు నెలల తరువాత.. కాల్ రికార్డింగ్ తో బయటపడ్డ మర్డర్ మిస్టరీ 

సారాంశం

మూడు నెలల కిత్రం జరిగిన ఓ  కాల్ రికార్డింగ్ ఓ మర్డర్ మిస్టరీని ఛేదించింది. అది సహజ మరణం కాదనీ, పక్కా ప్లాన్ ప్రకారం చేసిన అని తెలిసింది. ఆ హత్య చేసింది కట్టుకున్న భర్తనేనని తెలింది.ఈ ఘటన మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. 

మూడు నెలల కిత్రం కాల్ రికార్డింగ్ ఓ మర్డర్ మిస్టరీని ఛేదించింది. అది సహజ మరణం కాదనీ, పక్కా ప్లాన్ ప్రకారం చేసిన అని తెలిసింది. ఆ మర్డర్ చేసింది ఎవరో కాదు.. కట్టుకున్న భర్తనే ఆయనను కట్ట తెర్చింది. ఈ ఘటన మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో ఈ  మర్డర్ కేసు వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన బ్రహ్మపురి నగరంలోని గురుదేవ్ నగర్‌లో చోటుచేసుకుంది.

వివరాల్లోకెళ్తే.. మూడు నెలల క్రితం.. చంద్రపూర్ జిల్లాలో నివసిస్తున్న శ్యామ్ రామ్‌టేకే (66) అనే వ్యక్తి ఆగస్టు 6న హత్యకు గురయ్యాడు. గుండెపోటుతో నిద్రలోనే మృతి చెందినట్లు ఆయన భార్య (రంజనా రామ్‌టేకే)తన బంధువులందరికీ తెలియజేసింది. ఆమె చెప్పిందే  నిజం అని అందరూ అంగీకరించారు. మృతుడు శ్యామ్ రామ్‌టేకేకు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. వారు నాగ్‌పూర్‌లో నివసిస్తున్నారు. ఆమె 
కూతుళ్లిద్దరూ తల్లి మాటలు నిజమని అంగీకరించారు.  అంత్యక్రియలు కూడా చేశారు. భర్త చనిపోవడంతో ఆ మహిళ ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. ఈ క్రమంలో తన తల్లి దగ్గరకు వచ్చిన కుమార్తె.. తన తల్లి ఫోన్ ను పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తన తల్లి కాల్ డేటాను పరిశీలించగా.. ఆమె కంటికి ఓ ఆడియో క్లిప్ కనిపించింది. తీరా పరిశీలించి చూడగా.. ఈ వ్యవహరం తెరపైకి వచ్చింది.

హత్య జరిగిన కొద్దిసేపటికే ఆ మహిళ తన ప్రేమికుడికి ఫోన్ చేసి.. తన భర్తకు విషమిచ్చి.. అతనిని దిండుతో ఊపిరాడకుండా చేసాననీ,ఉదయం బంధువులకు ఫోన్ చేసి అతని మరణం గురించి తెలియజేస్తాననీ,అతనికి గుండెపోటు వచ్చిందని వారికి  చెబుతానని ఫోన్లో చెప్పింది. ఆడియో క్లిప్ బహిర్గతం కావడంతో.. హత్యకు గురైన వ్యక్తి కూతురు ఫిర్యాదు మేరకు నిందితురాలు రంజనా రామ్‌టేకే, ఆమె ప్రేమికుడు ముఖేష్‌ త్రివేదిలను పోలీసులు అరెస్టు చేశారు.

PREV
click me!

Recommended Stories

Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు