
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్‌వీందర్ సింగ్ సుఖు ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ అత్యవసరంగా ల్యాండైంది. గురువారం సీఎం ప్రయాణిస్తున్న ఛాపర్ రాంపూర్‌లోని బితాల్‌లో ఎమర్జెన్సీ ల్యాండైనట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆ హెలికాఫ్టర్‌లో ముఖ్యమంత్రి వెంట పబ్లిక్ వర్క్స్ మంత్రి, థియోగ్ ఎమ్మెల్యే, సీఎం ప్రెస్ సెక్రటరీ వున్నారు. జేఎస్‌డబ్ల్యూ కంపెనీ ప్రాజుక్ట్ ప్రాంగణంలో హెలిప్యాడ్ నిర్మించారు. అయితే సీఎం హెలికాఫ్టర్ నిర్ణీత ప్రదేశంలో ల్యాండ్ కాలేదు.. అక్కడికి 500 మీటర్ల దూరంలో వున్న పొలంలో అత్యవసరంగా దిగింది. పైలట్లు చాకచక్యంగా వ్యవహరించడంతో సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు సురక్షితంగా వున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.