అస్సాం-మేఘాలయ సరిహద్దు వివాదం: ఆరు రోజులుగా చల్లారని ఉద్రిక్తతలు.. పలు చోట్ల 144 సెక్షన్ అమలు.. 

By Rajesh KarampooriFirst Published Nov 27, 2022, 2:34 PM IST
Highlights

అస్సాం-మేఘాలయ హింసాకాండ పెరగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మేఘాలయలో  ట్రక్కులు, ప్రయాణీకుల వాహనాల రాకపోకలను పోలీసులు తాత్కాలికంగా నిషేధించారు. ఇరు రాష్ట్రాలోని ప్రధాన నగరాల్లో సెక్షన్ 144 అమలులో ఉంది. 

అసోం, మేఘాల‌య మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు చ‌ల్లార‌లేదు. గత ఆరు రోజులుగా ఇరు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో సెక్షన్ 144 విధించబడే ఉంది. సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొనడంతో భారీ పోలీసు బలగాలను మోహరించారు. అదే సమయంలో.. ఇప్పటికే కొనసాగుతున్న ప్రయాణ ఆంక్షలను అలాగే కొనసాగుతున్నాయి. మంగళవారం జరిగిన ఈ ఘటన తర్వాత అస్సాం పోలీసులు పొరుగు రాష్ట్రాలకు వెళ్లవద్దని ప్రజలను కోరారు. మేఘాలయలో పరిస్థితి ఇప్పటికీ పూర్తిగా శాంతియుతంగా లేదని పోలీసులు తెలిపారు. అస్సాంకు చెందిన వ్యక్తులు లేదా వాహనాలపై దాడులు జరిగే అవకాశం ఉండదని, కాబట్టి ఆ రాష్ట్రానికి వెళ్లవద్దని ప్రజలను కోరుతున్నాం. ఎవరైనా ప్రయాణించాల్సి వస్తే మేఘాలయలో రిజిస్టర్డ్ వాహనాల్లో వెళ్లాలని కోరినట్లు తెలిపారు.

సరిహద్దు జిల్లాల్లో బారికేడ్ల ఏర్పాటు

అస్సాం నుండి మేఘాలయలోకి ప్రవేశించే రెండు ప్రధాన ప్రాంతాలైన కాచర్ జిల్లాలోని గౌహతి,జోర్బాత్ వద్ద పోలీసు బారికేడ్లు ఏర్పాటు చేయబడ్డాయి. అయితే ట్రక్కులు, లగేజీలు, ఇతర వస్తువులను తీసుకెళ్లే వాణిజ్య వాహనాలపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని అధికారి తెలిపారు.

సిట్‌ ఏర్పాటు 

మేఘాలయ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) డాక్టర్ ఎల్ఆర్ బిష్ణోయ్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ సంఘటనపై దర్యాప్తు చేయడానికి మేఘాలయ సిట్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఏడుగురు సభ్యుల సిట్‌కు ఐడీ స్థాయి అధికారి నేతృత్వం వహిస్తారని తెలిపారు. పరిస్థితిని అనుక్షణం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. అయితే.. గురువారం నాడు కొన్ని చోట్ల చెదురుమదురు సంఘటనలు జరిగాయనీ, వెంటనే పోలీసులు అప్రమత్తం కావడంతో వాటిని అదుపులోకి వచ్చామని తెలిపారు.సంఘటనా స్థలాన్ని తాను స్వయంగా వెళ్లి.. సందర్శించినట్టు తెలిపారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి సాధారణంగానే ఉన్నప్పటికీ.. భవిష్యత్తులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా  భద్రతా బలగాలను మోహరించినట్టు తెలిపారు. స్థానికులకు అసలు విషయాన్ని పోలీసులు అర్థమయ్యేలా వివరించే ప్రయత్నాలు చేశారు.  

మేఘాలయకు వెళ్లే వ్యక్తులపై అస్సాంలోనిషేధం

అస్సాంలో  వరుసగా ఐదవ రోజులుగా..  శనివారం కూడా మేఘాలయ ప్రజలు, ప్రైవేట్ వాహనాల రాకపోకలపై నిషేధాన్ని కొనసాగుతోంది. శాంతిభద్రతల దృష్ట్యా మేఘాలయకు వెళ్లవద్దని అస్సాం పోలీసులు రాష్ట్ర ప్రజలకు సూచించారు. మంగళవారం ఉదయం అస్సాం-మేఘాలయ సరిహద్దులో జరిగిన హింసాకాండలో ఫారెస్ట్ గార్డు సహా ఆరుగురు చనిపోయారు. అక్రమంగా నరికివేసిన కలపతో కూడిన ట్రక్కును అస్సాం అటవీ సిబ్బంది అడ్డుకున్నారు. ఈ సమయంలో ఈ దాడి జరిగింది.

click me!