
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్కూల్ లో విద్యాభ్యాసం చేసే సమయంలో విద్యాబోధన చేసిన టీచర్ మృతి చెందాడు. తనకు విద్యాబోధన చేసిన టీచర్ మృతి చెందడంపై ప్రధాని విచారం వ్యక్తం చేశారు. తనకు పాఠశాలలో విద్యాబుద్దులు నేర్పిన టీచర్ రాస్బిహరీ మనియార్ మృతి చెందిన విషయం తెలుసుకుని చాలా బాధపడినట్టుగా చెప్పారు. రాస్బిహరీ మార్గదర్శకంలో తాను పనిచేసినట్టుగా మోడీ గుర్తు చేసుకున్నారు
ప్రధాని మోడీ తనకు పాఠశాల, కాలేజీ స్థాయిల్లో విద్యను బోధించిన టీచర్లను సన్మానించారు. అవకాశం దొరికినప్పుడల్లా టీచర్లతో తనకు ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకొనేవారు.