వెదర్ అప్ డేట్ : నేడు ఏపీతో సహా, పలు రాష్ట్రాల్లో అతి భారీవర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..

Published : Sep 14, 2022, 10:01 AM IST
వెదర్ అప్ డేట్ : నేడు ఏపీతో సహా, పలు రాష్ట్రాల్లో అతి భారీవర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..

సారాంశం

ఆంధ్రప్రదేశ్ తో సహా పలు రాష్ట్రాల్లో బుధవారం అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. 

న్యూఢిల్లీ :  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో బుధవారం అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తాజాగా వెల్లడించింది. ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, సిక్కిం, గుజరాత్,  ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, బీహార్, మధ్యప్రదేశ్, ఢిల్లీ,  హర్యానా, ఉత్తర ప్రదేశ్, jharkhand, నాగాలాండ్, గోవా రాష్ట్రాల్లో ఓ మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.  బుధవారం ఐఎండీ విడుదల చేసిన వెదర్ బుల్ టెన్ లో వచ్చే మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. 

కోస్తా ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఐఎండీ అధికారులు అలర్ట్ ప్రకటించారు. భారీ వర్షాలవల్ల శ్రీకాకుళం, చెన్నై- కోల్కతా జాతీయ రహదారిపై వరద నీరు నిలిచింది. అసెంబ్లీ నియోజకవర్గంలోని  రణస్థలం, లావేరు ప్రాంతాలూ వరద నీటిలో మునిగిపోయాయి.  చాలా రోడ్లు జలమయమయ్యాయి. రత్నాచలంలో ఇల్లు వరద నీటిలో మునిగాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని గర్హ్వాల్, కుమాన్ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాల్లో ఐఎండీ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు.

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పలు జిల్లాలో బుధవారం ఉరుములు, మెరుపులతో అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు.  మహారాష్ట్రలోని ముంబై, థానే, సింధుదుర్గ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్  జారీ చేశారు. మధ్యప్రదేశ్, కొంకణ్, గోవా ప్రాంతాల్లో వచ్చే ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వేదర్ బులెటిన్ లో పేర్కొన్నారు. మహారాష్ట్రలోని ముంబై, రాయ్ గడ్, రత్నగిరి, థానే, పాల్ఘార్  జిల్లాలో వచ్చే ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు. 

గుజరాత్‌లో బీజేపీదే మళ్లీ అధికారం.. ప్రజలు తప్పుడు హామీలు విని మోసపోరు - అమిత్ షా

ఇదిలా ఉండగా, క్యుములోనింబస్ మేఘాల ప్రభావం వల్ల దేశంలోని  పలు రాష్ట్రాల్లో రాగల 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ మంగళవారం విడుదల చేసిన ఒక వాతావరణ ప్రకటనలో వెల్లడించింది. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో వచ్చే 48 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ముంబై నగరంతోపాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతాయని ఐఎండీ పేర్కొంది. 

ముంబై నగరంలో ఐఎండి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సెప్టెంబర్ 14 నుంచి 16వ తేదీ వరకు మూడు రోజుల పాటు రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. క్యుములోనింబస్ క్లౌడ్ ప్రభావం వల్ల మహారాష్ట్రలోని పూణే, అహ్మద్నగర్ ప్రాంతాల్లో  వచ్చే నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని పూణే నగర ఐఎండీ విభాగం అధికారి డాక్టర్ అనుపం కశ్యప్ చెప్పారు.  డెహ్రాడూన్, చంపావత్, పిటోరాఘడ్, భాగేశ్వర్, నైనిటాల్ జిల్లాలో అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.

దక్షిణ గుజరాత్, ఉత్తర మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో వచ్చే ఐదు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు. పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. కోల్ కతా, హౌరా, పశ్చిమ మిడ్నాపూర్, బీర్భూమ్, ముర్షిదాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వివరించారు. రాజస్థాన్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు. చతిస్గడ్,  jharkhand, కొంకణ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు హెచ్చరించారు. 
 

PREV
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?