
గుజరాత్‌లో బీజేపీ మళ్లీ అధికారం చేపడుతుందని, మూడింట రెండొంతుల మెజారిటీని సాధిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ పేరు ప్రస్తావించకుండా.. ప్రజలు తప్పుడు వాగ్దానాలు విని మోసపోరని అన్నారు. గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి అయిన సందర్భంగా నిర్వహించిన ఈవెంట్ లో అమిత్ షా ప్రసంగించారు.
బీజేపీ చేపడుతున్న అభివృద్ధి పనులపై ప్రజలు తీర్పు చెప్పాలని ఆయన అన్నారు. గుజరాత్ ప్రజల
గురించి తనకు బాగా తెలుసని చెప్పారు. తమ పార్టీ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరిగాయని కాంగ్రెస్‌పై అమిత్ షా విరుచుకుపడ్డారు. ‘‘ మెరుగైన శాంతిభద్రతల పరిస్థితి వల్ల రాష్ట్రంలో పురోగతి సాధ్యమైంది. కాంగ్రెస్ పాలనలో అల్లర్లు, కర్ఫ్యూలు, పేలుళ్లు జరిగాయి.’’ అని ఆరోపించారు.
భారత్ జోడో యాత్రకు సీపీఎం వ్యతిరేకం కాదు - ఆ పార్టీ కేరళ రాష్ట్ర కార్యదర్శి ఎంవీ గోవిందన్
భూపేంద్ర పటేల్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఒక వర్గం ప్రజలు కొంత ఆందోళనకు గురయ్యారని అమిత్ షా అన్నారు. కానీ అందరి ఆందోళనలు తప్పని పటేల్ నిరూపించారని తెలిపారు. విజయవంతంగా ఆయన ఒక సంవత్సరం పదవిని పూర్తి చేశారని చెప్పారు. ఇటీవలి నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదికను చూపుతూ విద్య, ఆరోగ్యం, ఇతర రంగాలలో గుజరాత్ సుపరిపాలనలో మొదటి స్థానంలో ఉందని అమిత్ షా తెలిపారు.
పెళ్లైన వ్యక్తితో వివాహేతర సంబంధం.. ఇంట్లో తెలియడంతో పారిపోయి, చెట్టుకు ఉరేసుకుని...
ప్రధాని మోదీ ప్రారంభించిన అభివృద్ధి పనులను పటేళ్లు కొనసాగించారని కేంద్ర హోం మంత్రి అన్నారు. ‘‘రాష్ట్రం పదేళ్లలో 8.2 శాతం వృద్ధిని కనబరిచింది. కరోనా మహమ్మారి నుండి ప్రపంచం ఇంకా బయటపడనప్పటికీ, భూపేంద్ర పటేల్ ప్రభుత్వం ఈ వృద్ధి రేటును కొనసాగించడంలో విజయం సాధించింది” అని షా అన్నారు. కాగా.. ఈ కార్యక్రమం సందర్భంగా గుజరాత్‌లోని సెమీకండక్టర్ ప్లాంట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు వేదాంత గ్రూప్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒక ఒప్పందంపై సంతకం చేసింది. అలాగే 1,179 కోట్లతో పూర్తి చేసిన 519 ప్రజా సంక్షేమ అభివృద్ధి పనులను కూడా షా ప్రారంభించారు.