టీచర్ ఘాతుకం.. భార్య, కూతుర్లను వివస్త్రలు చేసి, విచక్షణారహిత దాడి.. నడివీధిలో అర్థనగ్నంగా కూర్చోబెట్టి...

Published : Sep 14, 2022, 09:33 AM IST
టీచర్ ఘాతుకం.. భార్య, కూతుర్లను వివస్త్రలు చేసి, విచక్షణారహిత దాడి.. నడివీధిలో అర్థనగ్నంగా కూర్చోబెట్టి...

సారాంశం

ఓ ఉపాధ్యాయుడు తన భార్య, కూతుర్లను చితకబాది... అర్థనగ్నంగా మార్చి.. నడివీధిలో కూర్చోబెట్టాడు. ఈ ఘటన రాజస్థాన్ లో కలకలం రేపింది. 

రాజస్థాన్ : రాజస్థాన్ లో ఓ టీచర్ దారుణానికి ఒడిగట్టాడు. పట్టరాని కోపంతో భార్య, కూతురి మీద దాడిచేసి సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరించాడు. సమాజానికి నీతులు చెప్పి.. భావి భారత పౌరులను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడే అత్యంత ఆటవికంగా వ్యవహరించాడు. సొంత భార్యను బట్టలూడదీసి చితకబాదాడు. దీన్ని చూసి అడ్డుకోబోయిన కూతురినీ విడిచిపెట్టలేదు. ఆమెను కూడా చావగొట్టాడు ఆ మూర్కుడైన ఉపాధ్యాయుడు. 

బాగా కొట్టి.. ఆ తరువాత ఇద్దరినీ అలాగే ఆరుబయట కూర్చోబెట్టాడు. రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్ పూర్ జిల్లా ఫలోదీ పట్టణంలో జరిగిన ఈ ఉదంతం సీసీకెమెరాల్లో రికార్డయ్యింది. వైరల్ గా మారిన ఈ వీడియో పోలీసుల దృష్టికి వెళ్లడంతో నిందితుడు కైలాశ్ సుథార్ ను అరెస్ట్ చేశారు. ప్రైవేట్ స్కూలు టీచరుగా పనిచేస్తున్న కైలాశ్ .. తన భార్య మానసిక పరిస్థితి సరిగా లేదని పోలీసులకు తెలిపాడు. కాలనీలో అశాంతి రేకెత్తిస్తున్న కారణంగా కైలాస్ ను అరెస్ట్ చేవామని, బాధితురాలి వైపు నుంచి ఫిర్యాదు అందితే వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేస్తామని ఫలోదీ పోలీస్ అధికారి రాకేష్ ఖ్యాలియా తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?