
Rainfall: దేశంలోని పలు ప్రాంతాల్లో రానున్న ఐదు రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. సెప్టెంబరు 8 నుంచి తూర్పు కోస్తా, మహారాష్ట్ర, గుజరాత్ ప్రాంతాల్లో వర్షపాతం పెరిగే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. “రాబోయే ఐదు రోజులలో దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలో భారీ వర్షపాతం కొనసాగే అవకాశం ఉంది. రానున్న ఐదు రోజుల్లో వాయువ్య భారతంలో వర్షపాతం కొనసాగనుంది’’ అని వాతావరణ శాఖ అంచనా వేసింది. రుతుపవన ద్రోణి పశ్చిమ చివర ప్రస్తుతం దాని సాధారణ స్థానం వెంట కొనసాగుతున్నదనీ, తూర్పు చివర దాని సాధారణ స్థితికి ఉత్తరం వైపుకు వెళ్తోందని తెలిపింది. తూర్పు చివర దక్షిణ దిశగా మారే అవకాశం కూడా ఉందని పేర్కొంది. "ఉత్తర-దక్షిణ ద్రోణి ఉత్తర అంతర్గత కర్ణాటక నుండి తక్కువ ట్రోపోస్పిరిక్ స్థాయిలలో కొమోరిన్ ప్రాంతం వరకు వెళుతుంది. తక్కువ ట్రోపోస్పిరిక్ స్థాయిలలో కొమోరిన్ ప్రాంతం, దానిని ఆనుకుని ఉన్న మాల్దీవులపై తుఫాను ప్రభావం ఉండనుందని” పేర్కొంది.
ఈ నెల 9వరకు కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానాంలో విస్తారంగా భారీ వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో నేడు భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశముంది. అలాగే, తెలంగాణ, కోస్టల్, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, తమిళనాడు, కేరళలలో రానున్న ఐదు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ అంచనా వేసింది.
గురువారం (సెప్టెంబర్ 8) వాతావరణ అప్డేట్స్:
శుక్రవారం (సెప్టెంబర్ 9) వాతావరణ అప్డేట్స్: