కిలాడీ : యాభైసార్లు అరెస్టైన పనిమనిషి.. పేర్లుమార్చి పనికి కుదిరి, దొంగతనాలు...

By AN TeluguFirst Published Jun 18, 2021, 9:47 AM IST
Highlights

మహారాష్ట్రలో ఓ పనిమనిషి రికార్డుల్లోకెక్కింది. అంటే పనిబాగా చేసి కాదు.. చేతివాటం చూపించి... పనిచేస్తున్న ఇళ్లలోనే వరుసగ చోరీలు చేసి ఇప్పటికి 50 సార్లు అరెస్ట్ అయ్యింది.

మహారాష్ట్రలో ఓ పనిమనిషి రికార్డుల్లోకెక్కింది. అంటే పనిబాగా చేసి కాదు.. చేతివాటం చూపించి... పనిచేస్తున్న ఇళ్లలోనే వరుసగ చోరీలు చేసి ఇప్పటికి 50 సార్లు అరెస్ట్ అయ్యింది.

ఆశ్చర్యంగా, కాస్త భయంగా అనిపిస్తున్న ఈ ఘటన వివరాల్లోకి వెడితే... ముంబైలో ఇళ్లలో పనిమనిషిగా పనిచేస్తున్న వనిత గైక్వాడ్ (38) చేతివాటం చూపించి వరుస దొంగతనాలకు పాల్పడింది. తాజాగా వనిత గైక్వాడ్ తాను పనిచేస్తున్న ఇంట్లోనే 2,500 డాలర్లు దొంగిలించిందనే ఫిర్యాదుతో ముంబై క్రైంబ్రాంచ్ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.

కరుడుగట్టిన దొంగగా పేరొందిన వనిత పలుసార్లు తాను పనిచేసిన ఇళ్లలోనే చోరీలకు పాల్పడింది. దీంతో పోలీసులు పలు చోరీ కేసుల్లో వనిత గైక్వాడ్ ను 50 సార్లు అరెస్ట్ చేశారు. ప్రతిసారి పేర్లు మారుస్తూ.. ఇళ్లలో పనిచేస్తానని పనికి కుదిరి.. ఆ తరువాత చోరీలకు పాల్పడుతుందని పోలీసులు తెలిపారు. 

విలేపార్లే నివాసి అయిన ఫ్యాషన్ డిజైనర్ దీపిక గంగూలీ ఇంట్లో దొంగతనం కేసును జుహూ పోలీసులు విచారించగా చోరీ బాగోతం బయటపడింది. విఖ్రోలీలో వనితాను పోలీసులు అరెస్టు చేశారు. ఈమెకు ఇద్దరు పిల్లలున్నారని, వారు వేర్వేరుగా నివసిస్తున్నారని పోలీసులు చెప్పారు.

సీసీటీవీ ఫుటేజీలో వనిత చోరీ బాగోతం బయటపడింది. వనిత చోరీ చేసిన ఇళ్లను గుర్తించేందుకు వాచ్ మెన్లను సంప్రదిస్తున్నామని పోలీసులు తెలిపారు. 
 

click me!