heavy Rains : అస్సాంలో మ‌ళ్లీ భారీ వ‌ర్షాలు.. కొండచ‌రియ‌లు విరిగిప‌డి నలుగురు స‌జీవ స‌మాధి

Published : Jun 14, 2022, 12:51 PM ISTUpdated : Jun 14, 2022, 12:54 PM IST
heavy Rains : అస్సాంలో మ‌ళ్లీ భారీ వ‌ర్షాలు.. కొండచ‌రియ‌లు విరిగిప‌డి నలుగురు స‌జీవ స‌మాధి

సారాంశం

అస్సాంను వరదలు ఆగమాగం చేస్తున్నాయి. గత నెల చివరి వారంలో కురిసిన భారీ వర్షాలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న రాష్ట్రంలో.. తాజాగా మళ్లీ వానలు మొదలయ్యాయి. సోమవారం నుంచి భారీ వర్షాలు ప్రారంభమయ్యాయి. 

అస్సాంలో మ‌ళ్లీ వ‌ర్షాలు విల‌య‌తాండ‌వం చేస్తున్నాయి. మంగ‌ళ‌వారం కురిసిన భారీ వ‌ర్షం వ‌ల్ల రాజధాని గౌహతిలోని బోరగావ్ సమీపంలోని నిజాపూర్‌లో కొండచరియలు విరిగిప‌డ్డాయి. ఈ ఘ‌ట‌న‌లో న‌లుగ‌రు చ‌నిపోయారు. వీరంతా కింద సజీవ సమాధి అయ్యారు. ఘటనా స్థలానికి రెస్క్యూ టీమ్ చేసుకొని మృతదేహాలను వెలికితీశాయి. చ‌నిపోయిన వారంతా భ‌వ‌న నిర్మాణ కూలీలే అని, స్థానికంగా అద్దె ఇంట్లో ఉంటూ నివ‌సిస్తున్నార‌ని పోలీసులు తెలిపారు. 

పెరుగుతున్న కాలుష్యం.. తగ్గుతున్న ఆయుష్షు : భారత్ లో కాలుష్యం పై తాజా రిపోర్ట్స్

‘‘ భ‌వ‌న నిర్మాణ కూలీలు తమ అద్దె ఇంట్లో ఉంటున్నారు. రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఒక్క సారిగా కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. దీంతో ఇంటి గోడ కూలిపోయి వారిపై ప‌డింది. కొండల మట్టి ఇంట్లోకి ప్రవేశించింది. ఈ విష‌యాన్ని స్థానికులు మాకు తెలియ‌చేశారు. మేము అక్క‌డికి చేరుకొని శిథిలాల కింద చిక్కుకొని ఉన్న నలుగురు వ్యక్తులను మేము బ‌య‌ట‌కు తీశాము. అప్ప‌టికే వారు చ‌నిపోయారు. మేము ఇంకా రెస్క్యూ ఆప‌రేష‌న్ నిర్వ‌హిస్తున్నాం. చ‌నిపోయిన న‌లుగురిలో ముగ్గురు ధుబ్రీకి చెందినవారు. మ‌రొక‌రు ఒకరు కోక్రాజార్‌కు చెందినవారు.’’ అని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ACP) నందిని కాకతి ANI వార్తా సంస్థకు తెలిపారు. 

రెండో రోజు ఈడీ విచారణకు హాజరైన రాహుల్ గాంధీ.. కొనసాగుతున్న కాంగ్రెస్ ఆందోళనలు..

అస్సాంలో సోమవారం రాత్రి నుంచి మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. గౌహతిలోని పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఏర్పడగా.. గౌహతి రైల్వే స్టేషన్‌లోని కొన్ని ప్రాంతాలు కూడా వరదలకు గురయ్యాయి. వర్షం కారణంగా గౌహతి అంతర్జాతీయ విమానాశ్రయంలో కూడా విమానాల రాకపోకలు ఆలస్యమయ్యాయి. కాగా భారీ వర్షాల నేపథ్యంలో గౌహతి, పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు అస్సాం ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లవద్దని సూచించింది. రానున్న మూడు రోజుల పాటు అసోం, మేఘాలయలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రెడ్ అలర్ట్ ప్రకటించింది.

presidential election 2022 : ‘‘నేను రాష్ట్రప‌తి అభ్య‌ర్థి రేసులో లేను’’ - ఎన్సీపీ అధినేత శరద్ పవార్

మే చివ‌రి వారంలో కూడా అస్సాంను వ‌ర‌దలు అత‌లాకుత‌లం చేశారు. రాష్ట్రంలోని చాలా జిల్లాలో ప్ర‌జ‌ల‌కు ఈ వ‌ర‌ద ప్ర‌భావానికి గుర‌య్యారు. అనేక మంది నిరాశ్ర‌యుల‌య్యారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 30 మంది వ‌ర‌కు ప్రాణాలు కోల్పొయారు. ప‌లు గ్రామాల ప్ర‌జ‌లు అయితే రైల్వే ప‌ట్టాల‌పై వ‌చ్చి ప్రాణాలు నిలుపుకున్నారు. కొండచరియలు విరిగిపడటంతో నాగావ్, కాచర్, మోరిగావ్, డిమా హసావో, గోల్‌పరా, గోలాఘాట్, హైలకండి, హోజాయ్, కమ్‌రూప్, కమ్రూప్ (మెట్రో), కర్బీ అంగ్లాంగ్ వెస్ట్, సోనిత్‌పూర్ - 12 జిల్లాల్లోని దాదాపు 5.61 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారని అథారిటీ ప్ర‌క‌టించింది. 

రాష్ట్రవ్యాప్తంగా 47,139.12 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. వరదల వల్ల నష్టపోయిన ప్రజల కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం  295 సహాయ శిబిరాలను ఏర్పాటు చేసింది. నిరాశ్రయులైన వేలాది మందిని సహాయ శిబిరాలకు త‌ర‌లించారు. అయితే అస్సాం వరద పరిస్థితిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (SDRF) నుండి మే 25న కేంద్రం రూ.324 కోట్ల అడ్వాన్స్‌ను విడుదల చేసింది.
 

PREV
click me!

Recommended Stories

India Gate Ahead of Republic Day 2026: త్రివర్ణ దీపాల కాంతులతో ఇండియా గేట్ | Asianet Telugu
Fresh Snowfall in Sonamarg: మోదీ ప్రారంభించిన సోనమార్గ్ఇప్పుడు ఎలా ఉందో చూడండి| Asianet News Telugu