ముంబైకి పొంచివున్న వానగండం: వచ్చే 48 గంటల్లో భారీ వర్షాలు

By Siva KodatiFirst Published Sep 19, 2019, 3:34 PM IST
Highlights

దేశ ఆర్ధిక రాజధాని ముంబైకి మరోసారి వానగండం పొంచివుంది. రానున్న 48 గంటల్లో ముంబై దాని శివారు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

దేశ ఆర్ధిక రాజధాని ముంబైకి మరోసారి వానగండం పొంచివుంది. రానున్న 48 గంటల్లో ముంబై దాని శివారు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముంబైతో పాటు రాయ్‌గఢ్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. సముద్ర తీర ప్రాంతాలకు వెళ్లొద్దని, అత్యవసర పరిస్థితుల్లో మినహా ప్రజలు బయటకు రాకూడదని సూచించారు. ముంబై, థానే, కొంకణ్ ప్రాంతాల్లోని స్కూళ్లు, కళశాలలకు సెలవు ప్రకటించారు.

ఈ ఏడాది ఇప్పటికే మూడు సార్లు ముంబై మహానగరం భారీ వర్షాలతో అతలాకుతలమైంది. వరదలతో పాటు భవనాలు కూలిపోయి, కొండచరియలు  విరిగిపడి అనేక మంది చనిపోయారు.

click me!