అమిత్ షాతో మమతా బెనర్జీ భేటీ: ఎన్ఆర్‌సీపై చర్చ

Siva Kodati |  
Published : Sep 19, 2019, 03:09 PM IST
అమిత్ షాతో మమతా బెనర్జీ భేటీ: ఎన్ఆర్‌సీపై చర్చ

సారాంశం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్  అధినేత్రి మమతా బెనర్జీ గురువారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. బెంగాల్‌లో ఎన్ఆర్‌సీని అమలు చేస్తారంటూ వచ్చిన కథనాలపై మీడియా ప్రతినిధులు మమతను ప్రశ్నించగా.. ఆమె ఖండించారు. అవన్నీ వదంతులేనని.. బెంగాల్‌లో ఎన్ఆర్‌సీ అవసరమే లేదని సీఎం తేల్చి చెప్పారు

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్  అధినేత్రి మమతా బెనర్జీ గురువారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లో వీరి సమావేశం జరిగింది.

అనంతరం దీదీ మీడియాతో మాట్లాడుతూ.. అసోంలో జాతీయ పౌర జాబితా అంశంపై హోంమంత్రితో చర్చించినట్లు తెలిపారు. అలాగే అసోంలో ఎన్ఆర్‌సీ జాబితా నుంచి 19 లక్షల మంది పేర్లను తొలగించిన అంశంపైనా చర్చించినట్లు వెల్లడించారు.

బెంగాల్‌లో ఎన్ఆర్‌సీని అమలు చేస్తారంటూ వచ్చిన కథనాలపై మీడియా ప్రతినిధులు మమతను ప్రశ్నించగా.. ఆమె ఖండించారు.

అవన్నీ వదంతులేనని.. బెంగాల్‌లో ఎన్ఆర్‌సీ అవసరమే లేదని సీఎం తేల్చి చెప్పారు. కాగా.. ఢిల్లీ పర్యటనలో ఉన్న మమతా బెనర్జీ బుధవారం ప్రధాని నరేంద్రమోడీతో సమావేశమైన సంగతి తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?
పౌర విమానయాన శాఖపై సభ్యుల ప్రశ్నలు | Minister Ram Mohan Naidu Strong Reply | Asianet News Telugu