ఐసొలేషన్ వార్డులో తనయుడు: తండ్రి ఆఖరు చూపునకు కూడా దూరం

By Sree sFirst Published Mar 14, 2020, 6:17 PM IST
Highlights

కరోనా వైరస్ ఉందన్న అనుమానంతో ఒక వ్యక్తిని హాస్పిటల్ లోని ఐసొలేషన్ వార్డులో ఉంచడం వల్ల తన తండ్రిని ఆఖరు చూపు చూసుకునే అదృష్టానికి కూడా నోచుకోలేదు. ఈ హృదయాన్ని పిండేసే ఘటన కేరళలో జరిగింది. 

కరోనా వైరస్ వల్ల ప్రపంచంలో ఇప్పటికే అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. చైనాలో పుట్టిన ఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా 123 దేశాలకు పాకి ప్రకంపనలు సృష్టిస్తోంది. భారత దేశంలో కూడా ఈ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. 

కరోనా అనుమానితులందరిని ప్రత్యేకమైన ఐసొలేషన్ వార్డులకు తరలించి చికిత్సను అందిస్తున్నారు. ఇతరులకు వైరస్ పాకకుండా చూసేందుకు వారిని ఎవ్వరితోను కలవనివ్వకుండా కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటుంది 

ఇలా కరోనా వైరస్ ఉందన్న అనుమానంతో ఒక వ్యక్తిని హాస్పిటల్ లోని ఐసొలేషన్ వార్డులో ఉంచడం వల్ల తన తండ్రిని ఆఖరు చూపు చూసుకునే అదృష్టానికి కూడా నోచుకోలేదు. ఈ హృదయాన్ని పిండేసే ఘటన కేరళలో జరిగింది. 

Also read: తిరుమల వెంకన్న ను కూడా తాకిన కరోనా

వివరాల్లోకి వెళితే... లీనో అబెల్ అనే వ్యక్తి ఖతార్ దేశంలో ఉద్యోగం చేస్తున్నాడు. పేస్ బుక్ పోస్టు ద్వారా అతని సోదరుడు అర్జెంటుగా కాల్ చేయమని మెసేజ్ పెట్టాడు. దానితో ఉన్నట్టుండి ఇంటికి ఫోన్ చేసాడు లీనో. 

తన తండ్రి నిద్రిస్తుండగా బెడ్ పై నుంచి కిందపడ్డాడని, పరిస్థితి విషమంగా ఉండడంతో హాస్పిటల్ లో చేర్చమని చెప్పాడు. ఈ విషయాన్నీ వెంటనే కంపెనీ ప్రతినిధులకు తెలుపడంతో వారు కొచ్చిన్ కి ఫ్లైట్ బుక్ చేసారు. 

కేరళలో కరోనా వైరస్ విస్తరిస్తుందని టీవీలో వార్తల ద్వారా తెలుసుకున్నప్పటికీ తండ్రిని చూడాలనే ఉద్దేశంతో ఇంటికి పయనం,అయ్యాడు. అలా అక్కడి నుండి ఎయిర్ పోర్టులో దిగిన తరువాత తనకు ఎటువంటి కరోనా లక్షణాలు లేనందువల్ల ఇంటికి వెళ్ళాను అన్నాడు. కాకపోటీహె తండ్రి ఐసీయూ లో ఉండడంతో చూడలేకపోయాడు. 

Also read: కరోనా బారినుండి బైటపడి... కర్నూల్ కు చేరుకున్న జ్యోతి

ఆసుపత్రి నుండి బయటకు వస్తున్నప్పుడు తనకు గొంతు నొప్పిగా ఉండడంతో కొట్టాయం మెడికల్ కాలేజీ వైద్యులను సంప్రదించడంతో వారు ఖతార్ నుండి వచ్చాడని తెలుసుకొని పరీక్షలు చేసి హుటాహుటిన కరోనా ఐసొలేషన్ వార్డుకు తరలించారు. 

ఇలా ఐసొలేషన్ వార్డులో లీనో ఉండగా తన తండ్రి మరణించాడు. తండ్రి పక్క వార్డులోనే మరణించినప్పటికీ కూడా చివరి చూపును కూడా చూడలేకపోయాడు. ఇంటికి తండ్రి శవాన్ని తీసుకువెళ్లిన తరువాత వీడియో కాల్ ద్వారా చివరి సారిగా తండ్రిని చూసుకున్నాడు. 

అతను ఆసుపత్రిలో ఏడుస్తుంటే అక్కడే ఉన్న నర్సుల నుండి డాక్టర్ల వరకు అందరూ కన్నీరు మున్నీరు అయ్యారు. తాను అసలు ఆసుపత్రికి రాకుండా ఉంటె తన తండ్రిని చివరి చూపైనా చూసుకునేవాడనని అన్నాడు. 

కానీ తాను ఖచ్చితంగా కరోనా వైరస్ ను ఎవ్వరికి వ్యాప్తి చేయకూడదనే ఉద్దేశంతోనే ఆసుపత్రిలో చేరినట్టు చెప్పాడు లీనో. 

 

click me!