కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు: నా వైఖరిని ఇప్పటికే చెప్పానన్న రాహుల్

By narsimha lodeFirst Published Sep 22, 2022, 3:10 PM IST
Highlights

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలపై తన వైఖరిపై ఇప్పటికే స్పష్టం చేసినట్టుగా రాహుల్ గాంధీ తెలిపారు. కేరళలోని ఎర్నాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

తిరువనంతపురం: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలపై తన వైఖరిని ఇప్పటికే స్పష్టం చేశానని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.  గురువారం నాడు కేరళలోని ఎర్నాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడారు. భారత్ జోడో యాత్ర మొదటి సెషన్ ముగించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.  పార్టీ అధ్యక్షుడిగా  ఎవరు బాధ్యతలు తీసుకున్నా భారత్ కోసం ఆలోచనలు , విశ్వాస వ్యవస్థ, థృక్పథానికి ప్రాతినిథ్యం వహిస్తాడని గుర్తుంచుకోవాలన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి అనేది కేవలం సంస్థాగత పదవి కాదన్నారు. అది సైద్ధాంతిక పదవిగా ఆయన పేర్కొన్నారు.  ఇతర పార్టీల సంస్థాగత ఎన్నికల గురించి మీరు ఎందుకు ప్రశ్నించరని ఆయన మీడియాను ఎదురు ప్రశ్నించారు. 

మీరంతా తనపై ఫోకస్ చేస్తున్నారు. కానీ దేశంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులను భాగస్వామ్యం చేయడం కోసం  తాను యాత్ర చేస్తున్నట్టుగా రాహుల్ గాంధీ చెప్పారు. వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలను భాగస్వామ్యులను చేయడమే భారత్ జోడో యాత్ర లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారు. 

 

LIVE: Media Interaction | Bharat Jodo Yatra | Kerala https://t.co/eQIgycono1

— Rahul Gandhi (@RahulGandhi)

;ప్రజలను బెదిరించడానికి బీజేపీ వద్ద అపరిమితమైన డబ్బు ఉందని రాహుల్ గాంధీ చెప్పారు. దీని ఫలితమే  గోవాలో తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ రకమైన విధానాలకు తాము నిరంతరం పోరాటం చేస్తున్నట్టుగా రాహుల్ గాంధీ చెప్పారు. ప్రజలను ఐక్యంగా ఉంచేందుకు ఈ యాత్ర నిర్వహిస్తున్న విషయాన్ని ఆయన పునరుద్ధాటించారు. కేరళలో యాత్ర విజయవంతమైందన్నారు. ప్రజలు స్వచ్ఛంధంగా యాత్రలో పాల్గొంటున్నారన్నారు.యూపీలో ఏం చేయాలనే దానిపై తమకు స్పష్టత ఉందన్నారు. దేశంలో వినాశకరమైన విధానాలతో నిరుద్యోగం, నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. దీంతో తమ యాత్రలో ప్రజలు స్వచ్చంధంగా పాల్గొంటున్నారని ఆయన చెప్పారు.  బీజేపీ విధానాలను ప్రజలు అర్ధం చేసుకొంటున్నారని ఆయన చెప్పారు. దేశంలోని ప్రజలు విపరీతమైన బాధలో ఉన్నారన్నారు. దీంతో యాత్ర యొక్క ప్రభఆవం అక్కడ అధికారంలో ఉన్న పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలు  యాత్రలో పాల్గొంటున్నారని  రాహుల్ గాంధీ పేర్కొన్నారు. 

 ఈనెల 7వ తేదీన తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారిలో భారత్ జోడో యాత్రను రాహుల్ గాంధీ ప్రారంభించారు.  జమ్మూ కాశ్మీర్ లో ఈ యాత్ర ముగియనుంది. ప్రస్తుతం యాత్ర కేరళ రాష్ట్రంలో సాగుతుంది. కేరళ రాష్ట్రం నుండి కర్ణాటక రాష్ట్రంలోకి యాత్ర ప్రవేశించనుంది. 

click me!