కాళ్లు, చేతులు కట్టేసిన స్థితిలో చెత్తకుప్పలో 8 ఏళ్ల బాలిక మృతదేహం, హర్యానాలో దుర్ఘటన

Published : Feb 14, 2023, 03:56 AM IST
కాళ్లు, చేతులు కట్టేసిన స్థితిలో చెత్తకుప్పలో 8 ఏళ్ల బాలిక మృతదేహం, హర్యానాలో దుర్ఘటన

సారాంశం

హర్యానాలో దారుణ ఘటన జరిగింది. ఎనిమిదేళ్ల బాలిక మృతదేహం ఓ చెత్తకుప్పలో అదీ, కాళ్లు, చేతులు కట్టేసిన స్థితిలో కనిపించింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.  

హిసార్: హర్యానాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఎనిమిదేళ్ల బాలిక మృతదేహం కాళ్లు, రెక్కలు కట్టేసిన స్థితిలో ఓ చెత్తకుప్పలో లభించింది. ఫిబ్రవరి 10వ తేదీన కనిపించకుండా పోయిన ఆ బాలిక విగత జీవై కనిపించింది. ఈ మేరకు పోలీసులు సోమవారం వెల్లడించారు.

ఆదివారం సాయంత్రం ఆ బాలిక మృతదేహం కనిపించింది. కాళ్లు, చేతులు కట్టేసిన స్థితిలో కనిపించిన ఆ బాలిక డెడ్ బాడీని సివిల్ హాస్పిటల్‌కు తరలించారు. ఆ హాస్పిటల్ వద్ద తమ బిడ్డ ప్రాణాలు తీసిన హంతకులను చంపేయాలని బాలిక తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేశారు.

భర్త వేరే చోట పనిలో ఉండగా ఫిబ్రవరి 10వ తేదీన ఆమె మిస్ అయింది. తాను వేరే చోట ఉన్నప్పుడు బాలిక కనిపించడం లేదని తల్లి ఫోన్ చేసి చెప్పిందని ఆయన వివరించాడు. ఆ తర్వాత తమ బంధువులంతా కలిసి వెతకడం ప్రారంభించామని తెలిపాడు.

Also Read: నాపై మంత్రాలు చేసి.. ‘తాంత్రిక్’ సెక్స్ చేశారు: దంపతులపై ఐఐటీ బాంబే స్టూడెంట్ ఆరోపణలు.. కేసు నమోదు

పోలీసుల దర్యాప్తు చేసి నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడిపై ప్రశ్నలు వేసి రాబట్టిన సమాధానా లతోనే బాలిక మృతదేహం లభించింది. 

అతడి పై పోలీసులు మర్డర్ కేసు నమోదు చేశారు. నిందితుడు హిసార్ నివాసి అని పోలీ సులు వివరించారు.

PREV
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !