
న్యూఢిల్లీ: ఎల్‌టీటీఈ చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ బ్రతికే ఉన్నారని, ఆయన ఆరోగ్యంగా ఉన్నారని తమిళనాడుకు చెందిన ఓ నేత సంచలన ప్రకటన చేశారు. ఈ విషయం అతని కుటుంబం అనుమతి తీసుకునే వెల్లడించినట్టు వివరించారు. సరైన సమయంలో ఆయన ప్రజల ముందుకు వస్తారని తెలిపారు. త్వరలోనే ప్రత్యేక తమిళ్ ఈలం కోసం ఆయన తన ప్రణాళికలను వెల్లడిస్తారని పేర్కొన్నారు. ఆయన ఇంకా బ్రతికే ఉన్నారనే వార్త పెను సంచలనాన్ని రేపింది. దీనిపై శ్రీలంక ప్రభుత్వం స్పందించింది.
తమిళనాడు నేత నేడుమారన్ చేసిన వ్యాఖ్యలను శ్రీలంక రక్షణ మంత్రి కొట్టిపారేసింది. ఇదేమైనా జోక్? అంటూ తోసిపుచ్చింది.
2009 మే 19వ తేదీన వేలుపిళ్లై ప్రభాకరన్ హతమైనట్టు ధ్రువీకరించారని శ్రీలంక డిఫెన్స్ మినిస్ట్రీ స్పోక్స్‌మ్యాన్ పీటీఐ న్యూస్ ఏజెన్సీకి తెలిపారు. ఆయన డీఎన్ఏ కూడా పరీక్షించినట్టు చెప్పారు.
Also Read: ఎల్‌టీటీఈ నేత ప్రభాకరన్ బ్రతికే ఉన్నారు.. ప్రజల ముందుకు వస్తారు: నెడుమారన్ సంచలన వెల్లడి
శ్రీలంకలో గెరిల్లా పోరాటానికి నాయకత్వం వహించిన ఎల్‌టీటీఈ నేత ప్రభాకరన్ బ్రతికే ఉన్నారని తమిళ్ నేషనలిస్ట్ మూవ్‌మెంట్ సంచలన ప్రకటన చేసింది. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిల్ ఈలం (ఎల్‌టీటీఈ) నేత వేలుపిళ్లై ప్రభాకరన్ బ్రతికే ఉన్నారని, సరైన సమయంలో ప్రజల ముందుకు వస్తారని టీఎన్ఎం లీడర్ పీ నెడుమారన్ వెల్లడించారు. వరల్డ్ తమిళ్ కాన్ఫడరేషన్ వ్యవస్థాపకుడు, తమిళ్ నేషనలిస్టు మూవ్‌మెంట్ అధ్యక్షుడు పీ నేదుమారన్.. ప్రభాకర్ గురించి మాట్లాడారు. ఇన్నాళ్లు ఒక పద్ధతి ప్రకారం వ్యవస్థ చేసిన తప్పుడు ప్రచారానికి తాను తెర దించుతున్నట్టు తెలిపారు. ఆయన త్వరలోనే తన ప్లాన్ వెల్లడిస్తారని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళులందరూ ఆయనకు మద్దతు తెలపాలని కోరారు.
ప్రభాకరన్ ఆరోగ్యంగా, దృఢంగా ఉన్నారని చెప్పారు. ఆయన కుటుంబం ప్రభాకరన్‌తో టచ్‌లో ఉన్నదని అన్నారు. అయితే, ఆయన ఎక్కడున్నారనే విషయాన్ని, ఆయన లొకేషన్‌ను తాను ఇప్పుడే వెల్లడించాలేనని తెలిపారు. తాను ఈ ప్రకటన ప్రభాకరన్ కుటుంబ సభ్యుల అనుమతితోనే చేస్తున్నట్టూ చెప్పారు.