Unmarried Pension: పెళ్లికాని వాళ్లకూ పింఛన్.. ప్రభుత్వం సమాలోచనలు

By Mahesh K  |  First Published Jul 3, 2023, 12:52 PM IST

పెళ్లికాని వాళ్లకూ పింఛన్ అందించాలనే నిర్ణయాలను హర్యానా ప్రభుత్వం చేస్తున్నది. నెల రోజుల్లో ఈ పింఛన్‌కు సంబంధించి నిర్ణయం తీసుకుని వెల్లడించనున్నట్టు తెలిసింది. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసు అవివాహితులైన స్త్రీ, పురుషులకు ఈ పింఛన్ అందించే అవకాశం ఉన్నది.
 


న్యూఢిల్లీ: వృద్ధులకు, వికలాంగులకు ప్రభుత్వాలు పింఛన్ ఇవ్వడం సర్వసాధారణ విషయం. నిరుద్యోగ భృతి డిమాండ్లనూ మనం విన్నాం. కానీ, పెళ్లి కాని వాళ్లకు పింఛన్ ఇవ్వాలనే డిమాండ్ ఎక్కడా వినలేదు. ఆ డిమాండ్ రావడమే కాదు.. ప్రభుత్వమూ అందుకు సుముఖంగా స్పందించి పెళ్లికాని వాళ్లకు పింఛన్ ఇవ్వాలనే ఆలోచనలు చేయడం గమనార్హం.

హర్యానా ప్రభుత్వం ఈ అసాధారణ నిర్ణయంపై ఆలోచనలు చేస్తున్నది. నెల రోజుల్లో పెళ్లి కాని వారికి పింఛన్ ఇచ్చే విషయంపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. ఈ పథకం అమలు చేస్తే.. దాని కింద పెళ్లి కాని వారు ప్రయోజనాలు పొందుతారు. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయస్సు గల అవివాహితులు ఈ పథకానికి అర్హులు అని భావిస్తున్నారు. 

Latest Videos

పురుషులతోపాట స్త్రీలకూ ఈ పథకం కింద పింఛన్ ఇచ్చే యోచనలో ఉన్నారు. ఈ విషయాలను సీఎం మనోహర్ లాల్ ఖట్టార్ వెల్లడించడం గమనార్హం. ఓ కార్యక్రమంలో 60 ఏళ్ల అవివాహిత తనకు పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వానికి ఆర్జీ పెట్టుకుంది. దీనికి సమాధానం ఇస్తూ హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టార్ అందుకు అనుగుణంగా పథకం ప్రారంభిస్తామని పేర్కొన్నారు.

Also Read: యూనిఫాం సివిల్ కోడ్ పై బీఎస్పీ వైఖరి ఏమిటీ? మాయావతి ఏమంటున్నారు?

హర్యానా వాసి అయి ఉండటంతోపాటు అవివాహితులై ఉండాలి. సంవత్సర ఆదాయం రూ. 1.80 లక్షలకు మించకుండా ఉండాలనే షరతులు పెట్టే అవకాశాలు ఉన్నాయి.  ఈ పథకం అమల్లోకి వస్తే 1.25 లక్షల మందికి ఈ పింఛను అందుతుందని కొన్ని నివేదికలు తెలిపాయి. ప్రస్తుతం హర్యానా ప్రభుత్వం వృద్ధాప్య పించన్, వికలాంగులకు పించన్ అందిస్తున్నది.

click me!