పార్టీలోకి తిరిగి రండి - రెబల్ ఎమ్మెల్యేలకు ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే విజ్ఞప్తి

Published : Jul 03, 2023, 12:11 PM IST
పార్టీలోకి తిరిగి రండి - రెబల్ ఎమ్మెల్యేలకు ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే విజ్ఞప్తి

సారాంశం

పార్టీలోకి తిరిగి రావాలని ఎన్సీపీ రెబల్ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే విజ్ఞప్తి చేశారు. పార్టీ రెండుగా చీలిపోవడం బాధాకరమని అన్నారు. తన సోదరుడు అజిత్ పవార్ తో ఎలాంటి విభేదాలూ లేవని స్పష్టం చేశారు. 

ఎన్సీపీ నేత అజిత్ పవార్ సొంత పార్టీ భారీ షాక్ ఇచ్చారు. పార్టీని రెండు ముక్కలుగా చీల్చారు. పలువురు ఎమ్మెల్యేలతో కలిసి పార్టీపైకి తిరుగుబాటు చేశారు. అనంతరం షిండే-బీజేపీ శిబిరంలో చేరారు. దీంతో ఆయన మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో అజిత్ పవార్ కు, తన సోదరికి మధ్య విభేదాలు వచ్చాయని వస్తున్న వార్తలపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే కొట్టిపారేశారు. తమ మధ్య అలాంటిదేదీ లేదని ఆమె స్పష్టం చేశారు

ఘోరం.. ఐదేళ్ల కుమారుడిని చంపి, భార్య కూతుర్లపై దాడి చేసి, ఆత్మహత్యకు పాల్పడ్డ వ్యాపారి.. ఎందుకంటే ?

పార్టీ సంస్థాగత బలోపేతానికి, రాష్ట్రం, దేశ సంక్షేమం కోసం రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తామని చెప్పారు. తిరుగుబాటు అనంతరం సోదరుడితో పొత్తుపై మీడియా అడిగిన ప్రశ్నకు సూలే సమాధానమిస్తూ.. ‘‘పార్టీ పునర్నిర్మాణం కోసం పోరాడతాం. రెబల్స్ తిరిగి పార్టీలోకి వస్తే సంతోషిస్తాను. భవిష్యత్తులో పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి. అజిత్ దాదాతో నా సంబంధాలు మారవు. ’’ అని అన్నారు. అయితే 'దేవగిరి'లో జరిగిన సమావేశంలో ఏం జరిగిందో వెల్లడించడానికి సూలే నిరాకరించారు, తనకు, తన సోదరుడికి మధ్య జరిగిన చర్చ తమ మధ్య మాత్రమే ఉంటుందని చెప్పారు.

దారుణం.. బ్రేకప్ చెప్పిందని 15 ఏళ్ల మాజీ ప్రేయసిని చంపిన 16 ఏళ్ల బాలుడు.. బర్త్ డేకు ఐదు రోజుల ముందు ఘటన

ఎన్సీపీలో సంక్షోభంపై సులే స్పందిస్తూ... ‘జరిగింది కచ్చితంగా బాధాకరం. అజిత్ దాదా అంటే నాకు ఎప్పటికీ గౌరవం ఉంటుంది. ఆయన ఎప్పటికీ నాకు సోదరుడే.’’ అని ఆమె అన్నారు. కాగా అజిత్ పవార్ తో పాటు మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ)ను వీడిన 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ దాఖలు చేసినట్లు మహారాష్ట్ర ఎన్సీపీ అధ్యక్షుడు జయంత్ పాటిల్ ప్రకటించారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో వస్తానో.. లేదో తెలియదు - కార్యకర్తలతో బండి సంజయ్ కుమార్

వారి చర్య చట్టవిరుద్ధమని, శరద్ పవార్ ను, పార్టీని చీకట్లో ఉంచారని అన్నారు. దీంతో జయప్రకాశ్ దండేగావ్కర్ నేతృత్వంలోని పార్టీ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశామని జయంత్ పాటిల్ చెప్పారు. క్రమశిక్షణ కమిటీ సిఫార్సు మేరకు ఎన్సీపీ తొమ్మిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను రాష్ట్ర శాసనసభకు మెయిల్ ద్వారా సమర్పించామని అన్నారు. ఈ విషయాన్ని ఆయన ఆదివారం మీడియా సమావేశంలో వెల్లడించారు. 

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం