కాంగ్రెస్ కు మాజీ సీఎం కుటుంబం షాక్ ... ఎమ్మెల్యే కిరణ్, వర్కింగ్ ప్రెసిడెంట్ శృతి రాజీనామా

By Arun Kumar P  |  First Published Jun 18, 2024, 11:06 PM IST

అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతున్న హర్యానా కాంగ్రెస్ కు భారీ షాక్ తగిలింది. మాజీ సీఎం కోడలు, మాజీ మంత్రి కిరణ్ చౌదరి తన కూతురితో కలిసి బిజెపిలో చేరేందుకు సిద్దమయ్యారు.


Haryana Assembly Elections 2024 : లోక్ సభ ఎన్నికల్లో హర్యానాలో కాంగ్రెస్ మంచి ఓట్లు, అధిక సీట్లు సాధించింది. ఇలాగే ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని చూస్తున్న ఆ పార్టీకి షాక్ తగిలింది. మాజీ సీఎం భన్సీలాల్ కోడలు, మనవరాలు కాంగ్రెస్ ను వీడారు. ప్రస్తుతం కిరణ్ చౌదరీ ఎమ్మెల్యేగా కొనసాగుతుండగా ఆమె కూతురు శృతి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ను వీడిన తల్లీకూతురు బిజెపిలో చేరేందుకు సిద్దమయ్యారు.  

ఎవరీ కిరణ్, శృతి చౌదరి..? 

Latest Videos

హర్యానా మాజీ సీఎం బన్సిలాల్ చౌదరి కుమారుడు సురేంద్ర సింగ్ భార్యే ఈ కిరణ్ చౌదరి. భర్త మృతి చెందడంలో రాజకీయాల్లో అడుగుపెట్టిన ఆమె ఐదుసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా పనిచేసారు. హర్యానాతో పాటు డిల్లీ ఎమ్మెల్యేగా కూడా పనిచేసారు. ఆమె డిల్లీ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ గా కూడా పనిచేసారు. 

ఇక కిరణ్ చౌదరి కూతురు శృతి చౌదరి కూడా హర్యానా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఈమె భివానీ-మహేంద్రగఢ్ నుంచి ఎంపీగా పనిచేసారు. ప్రస్తుతం హర్యానా కాంగ్రెస్ నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్స్ లో శృతి  ఒకరు. 

ఎందుకు రాజీనామా? 

ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో భివానీ-మహేంద్రగఢ్ లోక్ సభ టికెట్ శృతి చౌదరి ఆశించారు. గతంలో ఎంపీగా పనిచేసిన తన కూతురికి టికెట్ ఇప్పించుకోవడంలో కిరణ్ చౌదరి విఫలమయ్యారు. ఇక్కడి నుండి కాంగ్రెస్ మాజీసీఎం భూపీందర్ సింగ్ హుడా సన్నిహితుడు రావ్ దాన్ సింగ్ బరిలోకి దిగాడు.   అయితే అతడు బిజెపి అభ్యర్థి  ధరంబీర్ సింగ్ చౌదరి చేతిలో ఓటమిపాలయ్యారు.  

ఎంపీ టికెట్ దక్కకపోవడంతో గుర్రుగా వున్న తల్లీకూతురు ఇవాళ రాజీనామా చేసారు. కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ఈ ఇద్దరు ఆ లేఖను ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు పంపించారు. తన రాజీనామాకు గల కారణాలను ఈ లేఖలో పేర్కొన్నారు. 


 

click me!