హర్యానా సీఎం మనోహర్ లాల్ కట్టర్ కు కరోనా: ఆసుపత్రిలో చేరిక

Published : Aug 24, 2020, 09:04 PM ISTUpdated : Aug 24, 2020, 09:05 PM IST
హర్యానా సీఎం మనోహర్ లాల్ కట్టర్ కు కరోనా: ఆసుపత్రిలో చేరిక

సారాంశం

హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.  

న్యూఢిల్లీ: హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

కరోనా సోకడంతో ఆయన ఆసుపత్రిలో చేరాడు. అనారోగ్య సమస్యలు ఉండడంతో పరీక్షలు నిర్వహించుకోవడంతో కరోనా సోకినట్టుగా తేలిందని ఆయన చెప్పారు.తనను వారం రోజులుగా కలిసిన వారంతా క్వారంటైన్ లోకి వెళ్లాలని ఆయన సూచించారు. అంతేకాదు పరీక్షలు చేయించుకోవాలని కూడ ఆయన కోరారు.

also read:కేంద్ర మంత్రి శ్రీపాదనాయక్ ఆరోగ్య పరిస్థితి విషమం: గోవా సీఎం

హర్యానా స్పీకర్ గైన్ చంద్ కరోనా సోకిన  మరుసటి రోజునే హర్యానా సీఎం మనోహర్ లాల్ కట్టార్ కు కూడ కరోనా సోకింది. రెండు రోజుల క్రితం హర్యానా  అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. డిప్యూటీ స్పీకర్ రణబీర్ గంగ్వా అసెంబ్లీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 

అసెంబ్లీ స్పీకర్ త్వరగా కోలుకోవాలని సీఎం ఖట్టర్ కోరిన కొద్దిసేపట్లోనే ఆయనకు కూడ కరోనా సోకినట్టుగా తేలింది. సీఎం ఖట్టర్ తో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కూడ కరోనా సోకిందని మంత్రి అనిల్ విజ్ తెలిపారు.

PREV
click me!

Recommended Stories

యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు
భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu