మహారాష్ట్రలో కుప్పకూలిన ఐదంతస్తుల భవనం: శిథిలాల కింద 70 మంది

By narsimha lodeFirst Published Aug 24, 2020, 8:26 PM IST
Highlights

మహారాష్ట్రలో ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో  సుమారు 70 మంది చిక్కుకొన్నట్టుగా స్థానికులు చెబుతున్నారు.

ముంబై: మహారాష్ట్రలో ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో  సుమారు 70 మంది చిక్కుకొన్నట్టుగా స్థానికులు చెబుతున్నారు.

రాష్ట్రంలోని రాయ్ ఘడ్ జిల్లాలోని మహడ్ లోని ఐదంతస్తుల భవనం ఇవాళ కుప్పకూలింది. ఈ  ఘటనలో 70 మంది శిథిలాల కింద చిక్కుకొన్నారని అనుమానిస్తున్నారు. ఇప్పటివరకు 15 మందిని వెలికి తీశారు.

ఆరేళ్ల క్రితం ఈ భవనాన్ని నిర్మించారు. ఈ భవనంలో 45 ఫ్లాట్స్ ఉన్నాయి.  ఈ విషయం తెలిసిన వెంటనే మూడు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలను చేపట్టారు. 

ఇవాళ సాయంత్రం ఆకస్మాత్తుగా ఈ భవనం కుప్పకూలినట్టుగా స్థానికులు చెప్పారు.  ఈ భవనం ఎలా కుప్పకూలిపోయిందో అనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ భవనంలో సుమారు 50 కుటుంబాలు నివసిస్తున్నట్టుగా అధికారులు చెబుతున్నారు. 25 కుటుంబాలు సురక్షితంగా ఉన్నట్టుగా చెబుతున్నారు. ఇంకా  25 కుటుంబాల గురించి తెలియాల్సి ఉంది.

శిథిలాల కింద ఉన్న వారిని రక్షించేందుకు అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు.  ఎన్డీఆర్ ఎఫ్ సిబ్బందితో పాటు  అధికారులు, స్తానికులు కూడ సహాయక చర్యల్లో చురుకుగా పాల్గొంటున్నారు. 

click me!