ఏసి నుండి వెలువడిన విషవాయువు పీల్చి ఓ కుటుంబం మొత్తం మృతి

By Arun Kumar PFirst Published Oct 2, 2018, 7:28 PM IST
Highlights

ప్రస్తుతం ప్రతి షాఫింగ్ మాల్‌ల లోను,  కాస్త సంపన్నుల ఇళ్లలోను ఎయిర్ కండీషనర్ ఖచ్చితంగా కనిపిస్తుంటుంది. అయితే చల్లని గాలి అందించే ఈ ఎసీ కారణంగా ఓ కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.

ప్రస్తుతం ప్రతి షాఫింగ్ మాల్‌ల లోను,  కాస్త సంపన్నుల ఇళ్లలోను ఎయిర్ కండీషనర్ ఖచ్చితంగా కనిపిస్తుంటుంది. అయితే చల్లని గాలి అందించే ఈ ఎసీ కారణంగా ఓ కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.

తమిళనాడు పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కోయంబత్తూర్‌లోని తిరువళ్లువర్ నగర్‌‌లో శరవణన్‌(38), అతడి భార్య కలైరాశి(30), కుమారుడు కార్తీక్‌(8)లు  నివాసముంటున్నారు. అయితే వీరు తమ సౌకర్యం కోసం ఇంట్లో గతంలో ఓ ఎయిర్ కండీషనర్ ఏర్పాటుచేసుకున్నారు. అయితే ఈ ఏసి నుండి సోమవారం అర్థరాత్రి విషవాయువులు వెలువడి ముగ్గురు కటుంబసభ్యులు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసుల విచారణలో తేలింది.

మంగళవారం ఉదయం స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. భార్యా భర్తలతో పాటు వారి కొడుకు పడుకున్న చోటే విగతజీవులుగా మారడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  క్లూస్ టీంల సాయంతో వీరి హత్యకు గల కారణాలను ప్రాథమికంగా నిర్ధారించారు.  

సోమవారం రాత్రి ఈ ప్రాంతంలో విద్యుత్ పోవడంతో ఇంట్లోని ఇన్వర్టర్ ద్వారా ఎసి నడిచినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే ఎయిర్ కండిషర్‌ నుంచి హటాత్తుగా విషవాయువులు వెలవడడంతో ప్రమాదం జరిగి ఉంటుందని ఓ పోలీస్ అధికారి పేర్కొన్నారు. అయితే ఈ ఘటన గురించి మరింత లోతుగా విచారణ జరిపి ఈ కుటుంబం మృతిచెందడానికి గల కారణాలను పక్కాగా తెలుసుకుంటామని పోలీసులు వెల్లడించారు.
  

click me!