ఇజ్రాయెలీ యువతులపై హమాస్ దుండగులు దాష్టీకాలతో కలత చెంది ఇస్లాంను వదిలిపెట్టినట్టు యూపీకి చెందిన 23 ఏళ్ల ముస్కాన్ సిద్ధిఖీ ఓ అఫిడవిట్‌లో పేర్కొంది. ఆ తర్వాత హిందూ మతానికి చెందిన శిశుపాల్ మౌర్యను పెళ్లి చేసుకుంది.
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో ఓ ముస్లిం అమ్మాయి హమాస్ చేసిన అరాచకాలతో కలత చెందింది. ఇజ్రాయెలీ యువతులపై హమాస్ దుండగులు చేసిన అఘాయిత్యాలు టీవీలో చూసి బాధపడింది. అసలు ఇస్లాం మతమే వద్దనుకుంది. ఆ యువతి హిందూ మతంలోకి మారింది. ఆ తర్వాత హిందు యువకుడిని పెళ్లి చేసుకుంది. ఆ యువతి పేరు ముస్కాన్ సిద్దిఖీ. శిశుపాల్ మౌర్యను పక్షం రోజుల క్రితం పెళ్లి చేసుకుంది.
23 ఏళ్ల ముస్కాన్ సిద్దిఖీ యూపీలోని షహరన్‌పూర్‌కు చెందిన యువతి. ఆమె ఓ ఫ్యాక్టరీలో పని చేస్తున్నది. ఆ ఫ్యాక్టరీలోనే మహోలి చదియా గ్రామానికి చెందిన శిశుపాల్ మౌర్య కూడా పని చేస్తున్నాడు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో పని చేసుకుంటూ ఒకరిపై ఒకరు అభిప్రాయాలు, ఇష్టాలను పెంచుకున్నారు.
Also Read : Prakash Raj: రూ. 100 కోట్ల పోంజీ స్కామ్‌లో ప్రకాశ్ రాజ్‌కు ఈడీ సమన్లు
హమాస్ దాడులతో మనస్తాపం చెందిన ముస్కాన్ మతం మార్చుకుంటున్నట్టు అఫిడవిట్ ఫైల్ చేసింది. ఆమె ఇష్టాపూర్వకంగా, మరెవరి ఒత్తిడి లేకుండానే హిందూ మతాన్ని ఎంచుకుంటున్నట్టు పేర్కొంది. ఆ తర్వాత శిశుపాల్ మౌర్యను పెళ్లి చేసుకుంటున్నట్టూ ఇద్దరూ ఓ అగ్రిమెంట్‌లో సైన్ చేసుకున్నారు. హిందూ సంప్రదాయంలోనే రామకోట్ పోలీస్ స్టేషన్ ఏరియాలోని కాళీ మందిర్‌లో వీరు పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి వేడుకను ఆర్య సమాజ్ నిర్వహించింది. రాష్ట్రీయ హిందూ షేర్ సేనా చీఫ్ వికార్ హిందు సమక్షంలో వీరి పెళ్లి జరిగింది.