అనూహ్యంగా పెరిగిన హిందుస్తాన్ ఎరోనాటిక్స్ షేర్లు.. ఐదేళ్లలో 395 శాతం పెరుగుదల

Published : Jul 24, 2023, 12:54 PM IST
అనూహ్యంగా పెరిగిన హిందుస్తాన్ ఎరోనాటిక్స్ షేర్లు.. ఐదేళ్లలో 395 శాతం పెరుగుదల

సారాంశం

హెచ్ఏఎల్ షేర్లు అనూహ్యంగా పెరిగాయి. గడిచిన ఐదేళ్లలో ఈ ప్రభుత్వ రంగ కంపెనీ షేర్లు సుమారు 395 శాతం పెరిగాయి. అర్జెంటీనా డిఫెన్స్ మినిస్ట్రీ ఎల్‌ఎంయూ హెలికాప్టర్లను హెచ్ఏఎల్ ద్వారా ఉత్పత్తి చేసుకోవాలనే ఉద్దేశ్యాన్ని, అందుకు సుముఖతను వ్యక్తం చేయడంతో సోమవారం ఈ షేర్లు గణనీయంగా పెరిగాయి.  

న్యూఢిల్లీ: ప్రభుత్వ రక్షణ తయారీదారు హిందుస్తాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) షేర్లు అనూహ్యంగా పెరిగాయి. గత ఐదేళ్లలో 395 శాతం పెరిగాయి. అర్జెంటీనా దేశం హెచ్ఏఎల్‌తో లైట్, మీడియం యుటిలిటీ హెలికాప్టర్ల తయారీ కోసం డీల్ కుదుర్చుకోవడానికి సుముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో హెచ్ఏఎల్ షేర్లు సోమవారం గణనీయంగా పెరిగాయి.

సోమవారం రూ. 3869.95తో షేర్లు ఓపెన్ అయ్యాయి. క్రితం రోజు రూ. 3854.70గా ఆ షేర్లు ఉన్నాయి.

గత ఐదేళ్ల నుంచి హెచ్ఏఎల్ షేర్లు విజయవంతంగా సానుకూలంగానే సాగుతున్నాయి. స్టాక్ ప్రైస్ సుమారు 394.72 శాతం పెరిగింది.

రాఫఏల్ డీల్ సమయంలో 2019లో ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. రాఫేల్ డీల్‌లో ఆఫ్‌షోర్ కంపెనీగా భాగస్వామ్యం హెచ్ఏఎల్‌కు ఇవ్వకుండా ఓ కార్పొరేట్ కంపెనీకి ఇవ్వడంపై అప్పుడు దుమారం రేగింది. హిందుస్తాన్ ఎరోనాటిక్స్‌ లిమిటెడ్‌ను అంటే.. ఒక ప్రభుత్వ సంస్థను నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా నష్టపరుస్తున్నదని మండిపడ్డాయి.

Also Read : మణిపూర్ అంశంపై చర్చకు పట్టు.. ఉభయసభలు మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా.. ఆప్‌ ఎంపీపై సస్పెన్షన్..

హెచ్ఏఎల్, అర్జెంటీనా రక్షణ శాఖ గురువారం డీల్ కోసం సుముఖత వ్యక్తం చేసే పత్రంపై సంతకాలు చేశాయి. అర్జెంటీనా సైన్యం కోసం లైట్, మీడియా యుటిలిటీ హెలికాప్టర్ల తయారీ కోసం ఈ డీల్ ఉన్నది. ఈ డీల్ కుదుర్చుకోవడానికి అర్జెంటీనా సుముఖత వ్యక్తం చేసింది.

ఈ లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై అర్జెంటీనా రక్షణ మంత్రి జార్జ్ టయానా, హెచ్ఏఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సీబీ అనంతకృష్ణన్‌లు సంతకం పెట్టారు. బెంగళూరులోని హెచ్ఏఎల్ హెడ్‌క్వార్టర్‌లో ఈ కార్యక్రమం జరిగినట్టు ఓ ప్రకటనలో వెల్లడించింది.

అనంతకృష్ణన్, ఇతర సీనియర్ కంపెనీ అధికారులు.. ప్రతినిధులతో మాట్లాడారు. హెచ్ఏఎల్ కార్యకలాపాలు, ఇతర వివరాలను వారికి ప్రెజెంటేషన్‌ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఏఎల్ ఫ్లైయింగ్ ప్రాడక్ట్‌లను అర్జెంటీనా నుంచి వచ్చిన ప్రతినిధులు వీక్షించారు.

PREV
click me!

Recommended Stories

Ahmedabad International Kite Festival సంక్రాంతి సంబరాల్లో పతంగ్ లు ఎగరేసిన మోదీ| Asianet News Telugu
Digital Health : ఇక వైద్యరంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ... కీలక పరిణామాలు