జ్ఞానీ బాబా: రాహుల్‌పై స్మృతి ఇరానీ సెటైర్లు

Published : Jun 22, 2021, 04:54 PM IST
జ్ఞానీ బాబా: రాహుల్‌పై స్మృతి ఇరానీ సెటైర్లు

సారాంశం

 కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోడీపై విమర్శలు గుప్పించిన తర్వాత కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రాహుల్ పై వ్యంగ్యాస్త్రాలను సంధించారు. జ్ఞాన ముత్యాలను విప్పే" "జ్ఞానీ బాబా (తెలివైన సన్యాసి)" అని ఎగతాళి చేశారు. 

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోడీపై విమర్శలు గుప్పించిన తర్వాత కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రాహుల్ పై వ్యంగ్యాస్త్రాలను సంధించారు. జ్ఞాన ముత్యాలను విప్పే" "జ్ఞానీ బాబా (తెలివైన సన్యాసి)" అని ఎగతాళి చేశారు.  టీకా వికేంద్రీకరణ డిమాండ్ పై కాంగ్రెస్ యూటర్న్ తీసుకొందని ఆయన విమర్శించారు.  

also read:కరోనా థర్డ్‌వేవ్‌పై సిద్దం కావాలి:శ్వేతపత్రం విడుదల చేసిన రాహుల్

ఇవాళ ఉదయం  కరోనా థర్డ్ వేవ్ పై రాహుల్ గాంధీ  శ్వేత పత్రం విడుదల చేశారు. కరోనా తొలి, సెకండ్ వేవ్  విషయంలో ప్రభుత్వం సరిగా ప్లాన్ చేయలేదన్నారు.

 

కరోనాతో మరణించిన కుటుంబాలకు పరిహారం చెల్లించాలని ఆయన కోరారు. ఈ విషయమై ప్రభుత్వం సరిగా స్పందించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను స్మృతి ఇరానీతో పాటు పలువురు బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. కరోనా వైరస్ అంత తెలివైంది కాదని కర్ణాటక బీజేపీ నేతలు తెలిపారు. రాహుల్ గాంధీ మాదిరిగా కరోనా వైరస్ ట్రాన్స్ ఫార్మ్ కాదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ట్విట్టర్ వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు.

PREV
click me!

Recommended Stories

Government Jobs : రూ.78,800 శాలరీతో 173 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
EPFO కొత్త రూల్.. ఇకపై గూగుల్ పే, ఫోన్ పే ద్వారా పీఎఫ్ డబ్బులు