అది ధర్డ్‌ఫ్రంట్ ఏర్పాటు సమావేశం కాదు: తేల్చేసిన ఎన్సీపీ

By narsimha lodeFirst Published Jun 22, 2021, 3:28 PM IST
Highlights

శరద్ పవార్ నివాసంలో ఇవాళ జరిగే సమావేశం మూడో ఫ్రంట్ సమావేశం కాదని స్పష్టం చేశారు.ఈ సమావేశం ప్రస్తుతం దేశంలో చోటు చేసుకొన్న సంఘటనలను చర్చించేందుకు ఉద్దేశించినట్టుగా నిర్వాహకులు ప్రకటించారు

న్యూఢిల్లీ: శరద్ పవార్ నివాసంలో ఇవాళ జరిగే సమావేశం మూడో ఫ్రంట్ సమావేశం కాదని స్పష్టం చేశారు.ఈ సమావేశం ప్రస్తుతం దేశంలో చోటు చేసుకొన్న సంఘటనలను చర్చించేందుకు ఉద్దేశించినట్టుగా నిర్వాహకులు ప్రకటించారు.2024 ఎన్నికల్లో మోడీతో ఢీకొట్టేందుకు మూడో ఫ్రంట్ ఏర్పాటుకు ఈ సమావేశానికి ఎలాంటి సంబంధ: లేదని తెలిపారు.మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా ఇటీవల టీఎంసీలో చేరారు. 2018లో తాను ఏర్పాటు చేసిన రాజకీయ కార్యాచరణ బృందం సభ్యులను కలవాలని కోరినట్టుగా తెలిపారు.

రాష్ట్ర మంచ్ కు యశ్వంత్ సిన్హా నాయకత్వం వహిస్తున్నాడు. ఈ సమావేశం రాష్ట్ర మంచ్ చొరవ అని ఎన్సీపీ నేత ప్రపుల్ పటేల్ చెప్పారు. ఈ సమావేశంలో పాల్గొనాలని శరద్ పవార్ ను  సిన్హా కోరాడని ఆయన చెప్పారు. ఈ సమావేశానికి హాజరు కావాలని  ఎన్సీపీ నుండి కానీ, శరద్ పవార్ నుండి కానీ ఎలాంటి ఆహ్వానాలు అందలేదని శరద్ పవార్ సన్నిహితులు తెలిపారు. 

పలు రాజకీయ పార్టీల నేతలతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడ ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఇది విపక్షాల సమావేశం అంటే తాను నమ్మనన్నారు. ఎందుకంటే ఈ సమావేశానికి శివసేన, ఎస్పీ, బీఎస్పీ, చంద్రబాబు పార్టీలను ఆహ్వానించలేదన్నారు. విపక్షాలను ఏకతాటిపైకి  సమావేశంగా భావిస్తున్నానని శివసేన నేత సంజయ్ రౌతు చెప్పారు.

ఈ కార్యక్రమంలో  మాజీ సీఈసీ ఎస్‌వై ఖురేషీ, మాజీ అంబాసిడర్ కేసీ సింగ్ , ప్రముఖ పాటల రచయిత, జావేద్ అక్తర్, ఫిలిం మేకర్ ప్రీతి నంది, సీనియర్ లాయర్  కోలిన్ గోసాల్వే, కరణ్ థాపర్, ఆశుతోష్ తదితరులు హాజరౌతున్నారని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ చెప్పారు.ఈ సమావేశానికి తన తరపున ఒమర్ అబ్దుల్లా హాజరు కానున్నాడని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా ప్రకటించారు.

రాజకీయ వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ వరుసగా శరద్ పవార్ తో సమావేశాలు నిర్వహించిన తర్వాత ఈ సమావేశం గురించి ప్రకటన రావడంతో మూడో ఫ్రంట్ కోసమేననే చర్చ ప్రారంభమైంది.ఈ ప్రచారం తర్వాత ప్రశాంత్ కిషోర్ ఈ విషయమై స్పందించారు. మూడో ఫ్రంట్ ఏర్పాటు లేనేలేదని తేల్చి చెప్పారు.  ప్రస్తుత సమయంలో మూడో ఫ్రంట్, నాలుగవ ఫ్రంట్ పుట్టుకొస్తుందని తాను నమ్మలేనని ప్రశాంత్ కిషోర్ మీడియాకు చెప్పారు.బెంగాల్ లో టీఎంసీ విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో మమతకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు. 
 

click me!