థర్డ్ ఫ్రంట్ పై ప్రశాంత్ కిశోర్ షాకింగ్ కామెంట్స్..!

By telugu news teamFirst Published Jun 22, 2021, 3:09 PM IST
Highlights

బీజేపీని ఎదుర్కోవడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయనే ఊహాగానాలు రాజకీయవర్గాల్లో జోరందుకున్నాయి. 

జాతీయస్థాయిలో రాజకీయాలు కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.  కేంద్రంలో బీజేపీ తిరుగులేని శక్తిగా ఎదిగిన సంగతి తెలిసిందే. దీంతో...  బీజేపీని ఎదిరించేందుకు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఆమేరకు చర్చలు కూడా జరుగుతున్నట్లు సమాచారం.

ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌తో 10 రోజుల వ్యవధిలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ రెండోసారి భేటీ అయ్యారు. దీంతో బీజేపీని ఎదుర్కోవడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయనే ఊహాగానాలు రాజకీయవర్గాల్లో జోరందుకున్నాయి. అయితే సోమవారం ఢిల్లీలో జరిగిన ఈ సమావేశం రొటీన్‌గానే జరిగిందని ప్రశాంత్‌ కిషోర్‌ భేటీ అనంతరం తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఇతర రాజకీయ పక్షాలను ఏకం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై వీరి మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం.

కాగా.. తాజాగా.. ఈ విషయంపై ప్రశాంత్ కిశోర్ స్పందించారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాల కూటమి ఏర్పాటుతో తనకెలాంటి సంబంధం లేదని ప్రశాంత్‌ కిషోర్‌ పేర్కొన్నారు. మూడో ఫ్రంట్‌... నాలుగో ఫ్రంట్‌లను నేను విశ్వసించను. థర్డ్‌ ఫ్రంట్‌ బీజేపీ ఓడిస్తుందనే నమ్మకం తనకు లేదు అని  ప్రశాంత్‌ కిషోర్‌ అన్నారు.    

click me!