బ‌స్త‌ర్ లో కాల్పుల మోత‌.. మావోయిస్టులతో జరిగిన కాల్పుల్లో ఇద్దరు కోబ్రా కమాండోలకు గాయాలు

Published : Mar 09, 2023, 03:58 PM IST
బ‌స్త‌ర్ లో కాల్పుల మోత‌..  మావోయిస్టులతో జరిగిన కాల్పుల్లో ఇద్దరు కోబ్రా కమాండోలకు గాయాలు

సారాంశం

Raipur: ఛత్తీస్‌గఢ్‌లో మ‌రోసారి భ‌ద్ర‌తా బ‌ల‌గాలు, మావోయిస్టుల‌కు మ‌ధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. కోబ్రాకు చెందిన ఇద్దరు కమాండోలు గాయ‌ప‌డ్డారు. కోబ్రా 202వ బెటాలియన్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్ మునేష్ కుమార్ మీనా, కోబ్రా 208వ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్ అమిత్ మోదక్ లు గాయ‌ప‌డ్డార‌ని పోలీసులు తెలిపారు.   

Chhattisgarh encounter: న‌క్స‌ల్ ప్ర‌భావిత ప్రాంత‌మైన బ‌స్త‌ర్ లో మ‌రోసారి కాల్పుల మోత కొన‌సాగింది. భ‌ద్ర‌తా బ‌ల‌గాలు, మావోయిస్టుల‌కు మ‌ధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. కోబ్రాకు చెందిన ఇద్దరు కమాండోలు గాయ‌ప‌డ్డారు. కోబ్రా 202వ బెటాలియన్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్ మునేష్ కుమార్ మీనా, కోబ్రా 208వ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్ అమిత్ మోదక్ లు గాయ‌ప‌డ్డారు.

వివ‌రాల్లోకెళ్తే..  ఛత్తీస్‌గఢ్‌లో మ‌రోసారి భ‌ద్ర‌తా బ‌ల‌గాలు, మావోయిస్టుల‌కు మ‌ధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. న‌క్స‌ల్ ప్ర‌భావిత ప్రాంత‌మైన బ‌స్త‌ర్ లో సుక్మా జిల్లాలో గురువారం భద్రతా సిబ్బందికి, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జ‌రిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో సీఆర్పీఎఫ్ కమాండో బెటాలియన్ ఫర్ రెసల్యూట్ యాక్షన్ (కోబ్రా)కు చెందిన ఇద్దరు కమాండోలు గాయపడ్డారు. వారు స్వ‌ల్ప గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డార‌ని పోలీసు వ‌ర్గాలు తెలిపాయి. దక్షిణ సుక్మాలో గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ ఎదురుకాల్పులు జరిగాయ‌ని బస్తర్ రేంజ్ ఇన్‌స్పెక్టర్‌ జనరల్ ఆఫ్ పోలీస్ పీ.సుందరరాజ్  తెలిపారు.

ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులకు బుల్లెట్ గాయాలయ్యాయని తెలిపారు. అయితే, వారు ఘ‌ట‌న‌స్థ‌లం నుంచి తప్పించుకోగలిగారని ఆయన చెప్పారు. ఈ ఎన్ కౌంటర్ లో కోబ్రాకు చెందిన ఇద్దరు కమాండోలు గాయ‌ప‌డ్డార‌నీ, కోబ్రా 202వ బెటాలియన్ కు చెందిన ఇన్‌స్పెక్టర్‌ మునేష్ కుమార్ మీనా, కోబ్రా 208వ బెటాలియన్ కు చెందిన కానిస్టేబుల్ అమిత్ మోదక్ స్వల్పంగా గాయపడ్డారు. "ఈ ఎన్ కౌంటర్ లో  ఐదారుగురు మావోయిస్టులకు బుల్లెట్ గాయాలయ్యాయి. అయితే వారు అడవుల్లోకి పారిపోయి త‌ప్పించుకున్నారు" అని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. 

మావోయిస్టుల కదలికలపై పక్కా సమాచారంతో ఛత్తీస్ గఢ్ పోలీసుల స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్), దబ్బమార్క శిబిరంలోని కోబ్రా సిబ్బంది సంయుక్త బృందం మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ ను ప్రారంభించిందని సుందరరాజ్ తెలిపారు. త‌మ బృందం సక్లెర్ గ్రామం వైపు వెళ్తుండగా మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారనీ, సుమారు 45 నిమిషాల పాటు ఎదురుకాల్పులు జరిగాయని ఆయన చెప్పారు. ఫిబ్రవరి 25న మావోయిస్టులతో జరిగిన ఎదురుకాల్పుల్లో సుక్మా జిల్లా రిజర్వ్ గార్డ్ (డీఆర్జీ)కు చెందిన అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌ సహా ముగ్గురు జవాన్లు మరణించారు.


 

PREV
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu