
జైపూర్: రాజస్తాన్‌లో ఓ జుగుప్సాకర ఘటన వెలుగులోకి వచ్చింది. పుట్టినింట తల్లిదండ్రుల్లా.. మెట్టినింట అత్తమామలు చూసుకోవాలి. తండ్రి వెనుక తండ్రిలా మామ మసులుకోవాలి. కానీ రాజాస్తాన్‌లో బుండి జిల్లాలోని సిలోర్ గ్రామంలో ఈ హద్దులు చెరిపేసి కుటుంబ బాంధవ్యాలనే ప్రశ్నార్థకం చేసే ఘటన జరిగింది. తండ్రి స్థానంలో ఉన్న ఆ మామ కోడలిపైనే కన్నేశాడు. వారిద్దరూ కలిసి చెప్పా పెట్టకుండా ఇంటి నుంచి పారిపోయారు. కోడలికి ఆరు నెలల పాప. ఆ చిన్నారిని ఇంటి వద్దే వదిలి పారిపోవడం ఆ తల్లి హృదయంపైనా ప్రశ్నలు గుప్పిస్తున్నది.
ఆమె భర్త పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అసలు తన ఫిర్యాదును సీరియస్‌గా తీసుకోవడం లేదనీ ఆయన ఫిర్యాదులో పేర్కొనడం గమనార్హం.
Also Read: మహిళా జడ్జీకే వేధింపులు.. ఆమె ఫొటోలు మార్ఫింగ్ చేసి రూ. 20 లక్షలు డిమాండ్
పవన్ వైరాగి అనే వ్యక్తి సదర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పవన్ వైరాగి తన తండ్రి రమేశ్ వైరాగిపై ఫిర్యాదు చేశాడు. తండ్రి రమేశ్ వైరాగి తన భార్యతో కలిసి పారిపోయాడని ఆరోపించాడు. అదంతా తన తండ్రి తప్పేనని, తన తండ్రే తన భార్యను ప్రలోభపెట్టాడని పేర్కొన్నాడు. అంతే కానీ, తన భార్య మాత్రం అమాయకురాలని తెలిపాడు.
అంతేకాదు, తన తండ్రి కొన్ని చట్ట వ్యతిరేక పనులు చేశాడని, తన బైక్ కూడా దొంగిలించాడని ఆరోపించాడు. ఈ ఘటనను పోలీసులు సీరియస్‌గా తీసుకోవడం లేదని తెలిపాడు.
ఈ ఆరోపణలపై సదర్ స్టేషన్ ఆఫీసర్ అరవింద్ భరద్వాజ్ స్పందించారు. ఈ కేసును తాము సీరియస్‌గా తీసుకున్నామని, పారిపోయిన జంటను వెతికే ప్రయత్నాల్లో ఉన్నామని వివరించారు. దొంగిలించిన బైక్ కోసం గాలింపులు చేస్తున్నామని వివరించారు.