మధ్యప్రదేశ్‌లోని అనుప్పూర్ జిల్లాలోని కొత్మాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సునీల్ సరాఫ్ న్యూ ఇయర్ వేడుకల్లో రివాల్వర్‌తో కాల్చుకున్నారనే ఆరోపణలతో చిక్కుల్లో పడ్డారు. అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అదే సమయంలో ఎమ్మెల్యే తన క్లారిటీలో బొమ్మ రివాల్వర్‌ను వాడినట్లు తెలిపారు.
మధ్యప్రదేశ్‌లోని అనుప్పూర్ జిల్లాలోని కొత్మాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సునీల్ సరాఫ్ .. డాన్ అవతారం వైరల్‌గా మారింది. జనవరి 1న న్యూ ఇయర్ పార్టీలో సరాఫ్ వేదికపైకి చేరుకుని లైసెన్స్ రివాల్వర్‌తో గాలిలోకి కాల్పులు జరపడం వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మధ్యప్రదేశ్ హోంమంత్రి డాక్టర్ నరోత్తమ్ మిశ్రా అనుప్పూర్ ఎస్పీని ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.
2 months after being booked for molesting a married woman on board a Bhopal bound train, first time MP Cong MLA Sunil Saraf booked for celebratory firing from his gun on the stage of New Year bash organized by him in Kotma (Anuppur). pic.twitter.com/5w9VyvUHz2
— Anuraag Singh (@anuraag_niebpl)ఇంతకీ వీడియో ఏముంది?
undefined
వీడియో జనవరి 1 నాటిది. కాంగ్రెస్ ఎమ్మెల్యే తన ఇంటి వద్ద న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో భాగంగా.. పాటల కచేరీ.. దానికి అనుగునంగా అడియన్స్ స్టేప్పులేస్తున్నారు. ఈ క్రమంలో 'మై హూన్ డాన్' అనే హిందీ పాట ప్లే అవుతుండగా... ఎమ్మెల్యే సునీల్ డ్యాన్స్ చేస్తూ స్టేజ్‌పైకి చేరుకున్నారు. సెప్పులేస్తూ.. తన కోట్ నుంచి రివాల్వర్‌ను బయటకు తీసి.. గాలిలో కాల్పులు జరిపారు. దీంతో అక్కడి వారాంత ఒక్కసారిగా షాక్ గురయ్యారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఎవరో సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఆ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో బయటకు రావడంతో బీజేపీ నేత దిలీప్ జైస్వాల్, ఇతర నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే కాల్పులు జరుపుతుండగా.. కాంగ్రెస్ బ్లాక్ ప్రెసిడెంట్ మనోజ్ సోనీ, కొత్మా మున్సిపాలిటీ వైస్ ప్రెసిడెంట్ భర్త బద్రి తమర్కర్ కూడా వేదికపై ఉన్నారు.
అదే సమయంలో ఈ ఘటనపై ఆ రాష్ట్ర పార్టీ చీఫ్ వీడీ శర్మ, మీడియా కోఆర్డినేటర్ లోకేంద్ర పరాశర్, నరేంద్ర సలుజాతో సహా రాష్ట్రంలోని అధికార బీజేపీ నాయకులు స్పందించారు. సదరు కాంగ్రెస్ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా విచారణకు ఆదేశించారు. "ఎమ్మెల్యే తుపాకీతో కాల్చి కాల్చే వీడియోను నేను చూశాను. ఇలాంటి చర్యలు ప్రజా భద్రతకు ప్రమాదం కలిగిస్తాయి. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని అనుప్పూర్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ను నేను ఆదేశించాను" అని మిశ్రా మీడియాకు తెలిపారు.
హోంమంత్రి ఆదేశాల మేరకు కొత్మా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. భువనేశ్వర్ శుక్లా అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యేపై కేసు నమోదైంది. స్థానిక ఎమ్మెల్యే నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో పెద్ద సంఖ్యలో జనం ఉన్నందున, కాల్పులు జరపడం వల్ల కొంత అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉందని ఫిర్యాదుదారుడు ఆరోపించాడు. ఆ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నమని, ఆయుధ చట్టంలోని 25, 9 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు కొత్మా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ నరేష్ బైగా తెలిపారు.
ఎమ్మెల్యే వివరణ..
ఆ వీడియో వైరల్ కావడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే సునీల్ స్పందించారు. వీడియోలో కనిపిస్తున్న తుపాకీ తన లైసెన్స్‌డ్ రివాల్వర్ కాదని, దీపావళి సందర్భంగా ఉపయోగించే బొమ్మ తుపాకీ అని కోట్మా ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ ఘటనపై సీనియర్ కాంగ్రెస్ నాయకుడు,మాజీ మంత్రి పిసి శర్మ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే చర్యను సమర్థించారు. ఇది అంత పెద్ద నేరం కాదనీ,ఇటువంటి సంఘటనలను బదలు.. పెరుగుదలను నియంత్రించడం సహా మొత్తం శాంతిభద్రతల పరిస్థితిని మెరుగుపరచడానికి ప్రభుత్వం , పోలీసులు కృషి చేయాలని సూచించారు.
గతంలో లైంగిక ఆరోపణలు
అక్టోబర్ 2022లో సరాఫ్ , సత్నా ఎమ్మెల్యే సిద్ధార్థ్ కుష్వాహాతో సహా మరో ఇద్దరు మొదటిసారి రేవా నుండి భోపాల్‌కు రైలులో ప్రయాణిస్తున్నప్పుడు వివాహిత మహిళపై వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. రేవాంచల్ ఎక్స్‌ప్రెస్‌లోని మొదటి ఏసీ కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణిస్తున్న మహిళ .. మద్యం మత్తులో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనతో అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు.