ఆత్మలు వేధిస్తున్నాయంటూ తన పిల్లలతో కలిసి బావిలో దూకిన మహిళ

By Nagaraju TFirst Published Oct 16, 2018, 11:32 PM IST
Highlights

అహ్మదాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఆత్మలు తనను వేధిస్తున్నాయంటూ ఓ మహిల తన ఐదుగురు చిన్నారులతో కలిసి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఈ ఘటనలో చిన్నారి మినహా మిగిలిన నలుగురు చనిపోయారు. వివరాల్లోకి వెళ్తే గుజరాత్ లోని భావ్ నగర్ జిల్లా పంచ్ సిప్లా కు చెందిన గీత భాలియా తన ఐదుగురు పిల్లలతో కలిసి జీవిస్తోంది. 

అహ్మదాబాద్: అహ్మదాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఆత్మలు తనను వేధిస్తున్నాయంటూ ఓ మహిల తన ఐదుగురు చిన్నారులతో కలిసి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఈ ఘటనలో చిన్నారి మినహా మిగిలిన నలుగురు చనిపోయారు. వివరాల్లోకి వెళ్తే గుజరాత్ లోని భావ్ నగర్ జిల్లా పంచ్ సిప్లా కు చెందిన గీత భాలియా తన ఐదుగురు పిల్లలతో కలిసి జీవిస్తోంది. 

గీత  రెండు సంవత్సరాలుగా ఆత్మలు తనను వేధిస్తున్నాయంటూ తన కుటుంబ సభ్యులతోపాటు బంధువులతోనూ చెప్తూ ఉండేది. ఆత్మలు వేధించడం వల్ల తన కుటుంబంలో శాంతి ఉండటం లేదని ఆమె వాపోయేది. దానికి తోడు ఆర్థిక సమస్యలు కూడా తోడవ్వడంతో ఆమె మరింత కుంగిపోయింది. 

ఆత్మలు తనను తీసుకు వెళ్లిపోయేందుకే ఇలా సమస్యలు సృష్టిస్తున్నాయని ఆమె భావించింది. తాను చనిపోతే తన పిల్లలు అనాథలవుతారని భావించి వారితో కలిసి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఆత్మహత్యకు పాల్పడ్డ బావిని పరిశీలించారు. అయితే గీత భాలియా పెద్ద కుమార్తె ధర్మిస్త(10)ను మాత్రం పోలీసులు కాపాడగలిగారు. వైద్యం కోసం ధర్మిస్తను ఆస్పత్రికి తలరించారు. 

నాలుగు మృతదేహాలను స్థానికులు భావి నుంచి వెలికి తీశారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. నాలుగు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరబ్బాయిల మృతదేహాలతోపాటు తల్లి గీత భాలియా మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టు మార్టంకు పంపినట్లు తెలిపారు.  

చనిపోయిన చిన్నారుల వయసు సంవత్సరంన్నర నుంచి ఎనిమిదేళ్ల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. రెండేళ్లుగా గీత భాలియా తనను ఆత్మలు వేటాడుతున్నట్లు చెప్పి భయపడేదని తమ విచారణలో తేలినట్లు తెలిపారు. దాంతోపాటు ఆర్థిక సమస్యలు ఎక్కువ అవ్వడంతో ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపారు.  

click me!