జడ్జి కుటుంబంపై కాల్పులు: సెక్యూరిటీ గార్డు మహిపాల్ సింగ్ చరిత్ర ఇదీ

By narsimha lodeFirst Published Oct 16, 2018, 5:58 PM IST
Highlights

గురుగ్రామ్‌లో జడ్జి కృష్ణకాంత్ గార్గ్ భార్య, కొడుకుపై  కాల్పులు జరిపిన సెక్యూరిటీ గార్డు   మహిపాల్ సింగ్  చిన్నప్పటి నుండి అనేక కష్టాలను ఎదుర్కొన్నాడని ఆయన కుటుంబసభ్యులు చెబుతున్నారు


న్యూఢిల్లీ: గురుగ్రామ్‌లో జడ్జి కృష్ణకాంత్ గార్గ్ భార్య, కొడుకుపై  కాల్పులు జరిపిన సెక్యూరిటీ గార్డు   మహిపాల్ సింగ్  చిన్నప్పటి నుండి అనేక కష్టాలను ఎదుర్కొన్నాడని ఆయన కుటుంబసభ్యులు చెబుతున్నారు.  జీవితంలో అనేక ఆటుపోట్లను మహిపాల్ ఎదుర్కొన్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు.ఈ విషయాన్ని జాతీయ మీడియా ప్రసారం చేసింది. 

అక్టోబర్ 13వ తేదీన గురుగ్రామ్‌లో  జడ్జి కృష్ణకాంత్ గార్గ్ భార్య, కొడుకుపై సెక్యూరిటీ గార్డు  మహిపాల్ సింగ్ కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో  జడ్జి భార్య  రీతూ మరణించగా, కొడుకు  ధ్రువ్ బ్రెయిన్ డెడ్‌ అయ్యాడు. 

మహిపాల్ సింగ్  తల్లిని తండ్రి నిత్యం వేధింపులకు గురి చేసేవాడు.  మద్యం సేవించి వచ్చి దాడి చేసేవాడు.  అసభ్యంగా దూషించేవాడు. భర్త కొట్టిన దెబ్బలకు  ఆమెకు రెండు దఫాలు  గర్భస్రావమైంది.  అయితే మూడో సారి గర్భస్రావం కాకుండా  పుట్టింటికి వెళ్లింది. మహిపాల్ సింగ్  పుట్టగానే అతడి బాగోగులను అతడి మామ చూసుకోనేవాడు. 

ఏడాదికోసారి మహిపాల్ సింగ్ తండ్రి వద్దకు, తండ్రి తరపు బంధువుల వద్దకు వెళ్లేవాడు. తండ్రికి దూరమైన బాధ మహిపాల్ సింగ్‌లో ఉంది. కానీ, ఈ విషయాన్ని  అతను ఏనాడూ బయటపెట్టలేదన్నారు.

2007లో హర్యానా పోలీసు డిపార్ట్‌మెంట్‌లో మహిపాల్ సింగ్ ‌  కొత్త ఉద్యోగం సంపాదించాడు.  ఉద్యోగం రావడంతో 2008లో మహిపాల్  వివాహం చేసుకొన్నాడు. వికాస్‌దేవి అనే మహిళను పెళ్లి చేసుకొన్నాడు.  పెళ్లైన రెండో రోజునే ఆమె పుట్టింటికి వెళ్లింది. అయితే బంధువుల బలవంతం మీద  తిరిగి కాపురానికి వచ్చిందని మహిపాల్ మామ చెప్పారు.

కొద్ది రోజుల పాటు వీరి మధ్య ఎలాంటి గొడవలు లేవు. కానీ, తిగిరి భార్యాభర్తల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు పుట్టారు.  భార్యతో గొడవ పెట్టుకొన్నా కూడ  పిల్లలను  ఎంతో ప్రేమగా చూసుకొనేవాడని కుటుంబసభ్యులు చెబుతున్నారని  జాతీయ మీడియా ప్రసారం చేసింది.

కొన్ని రోజుల క్రితం మహిపాల్ సింగ్  మతం మారాడు. దీంతో బంధువులు అతడిని దూషించారు. దీంతో స్వంత ఊరికి కూడ వెళ్లడం మానేశాడు. మహిపాల్ సింగ్ జడ్జి కుటుంబం వద్ద సెక్యూరిటీ గార్డుగా చేరాడు.

జడ్జి కుటుంబం వద్ద  పనిచేసే సమయంలో మహిపాల్ సింగ్  పిల్లలను చూసేందుకు కూడ సెలవు దొరకలేదన్నారు.గౌరవం లేని చోట పనిచేయడం సరికాదని తనతో అనేవాడని  మహిపాల్ సింగ్ చెప్పారని  మామ గుర్తు చేస్తున్నారు.

మహిపాల్ సింగ్ అసలు ఎందుకు జడ్జి కుటుంబాన్ని ఎందుకు  టార్గెట్ చేశారనే విషయమై  సిట్  దర్యాప్తు చేస్తున్నాడు. అతడిపై ఎలాంటి కేసులు లేవన్నారు. డిప్రెషన్ కారణంగా  కాల్పులు  జరిపాడా.. లేక బలమైన  కారణాలు ఉన్నాయా అనే  కోణంలో  దర్యాప్తు చేస్తున్నారు.

click me!