కేజ్రీవాల్ కు ఎన్జీటీ షాక్: ఆప్ సర్కార్ కు రూ.50కోట్లు ఫైన్

By Nagaraju TFirst Published Oct 16, 2018, 5:49 PM IST
Highlights

ఢిల్లీ: కేజ్రీవాల్ సర్కార్ వరుస వివాదాల్లో ఇరుక్కుంటుంది. కేజ్రీవాల్ పదవీబాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. ఒక సమస్య పరిష్కారం అయ్యేసరికి మరో సమస్య వెంటాడుతోంది. తాజాగా ఆప్ సర్కార్ కు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ షాక్ ఇచ్చింది. రూ.50 కోట్లు పెనాల్టీ విధించింది. జనావాసాల్లో ఉక్కు శుద్ధి పరిశ్రమల నియంత్రణలో విఫలమైందని ఆరోపిస్తూ ఢిల్లీ ప్రభుత్వానికి జరిమానా విధించింది. 

వివరాల్లోకి వెళ్తే ఆలిండియా లోకాధికార్ సంఘం అనే ఎన్టీవో జనావాసాల్లో ఉక్కు శుద్ధి పరిశ్రమల ఏర్పాటు చేశారని వాటిని నియంత్రించడంలో కేజ్రీవాల్ సర్కార్ విఫలమైందని ఆరోపిస్తూ పిటీషన్ వేశారు. పరిశ్రమల నిషేదిత ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు కావడంవల్ల స్థానికులకు అనారోగ్య సమస్యలతో పాటు యుమునా నది కాలుష్యానికి గురవుతోందని ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. జస్టిస్‌ ఆదర్శ్‌కుమార్‌ గోయెల్‌ నేతృత్వంలోని బెంచ్‌ మంగళవారం ఢిల్లీ ప్రభుత్వానికి రూ. 50 కోట్లు పెనాల్టీ విధిస్తూ తీర్పు వెలువరించింది.

జనావాసాల్లో ఏర్పాటు చేసిన స్టీల్‌ శుద్ధి పరిశ్రమలను వెంటనే మూసేయించాలని ఆదేశాలు జారీచేసింది. మరోవైపు ఢిల్లీ మాస్టర్‌ప్లాన్‌-2021 ప్రకారం నిషేధించబడిన ప్రదేశంలో పరిశ్రమలు ఏర్పాటయ్యాయనీ, వాటిని నియంత్రించాలని ఢిల్లీ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు (డీపీసీసీ)కు ఎన్జీటీ గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. ఎన్జీటీ ఆదేశాలను పట్టించుకోకపోవడంతో కేజ్రీవాల్‌ ప్రభుత్వానికి భారీ జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 

click me!