ప్రధాని మోడీ యూనివర్సిటీ డిగ్రీ కేసుపై గుజరాత్ హైకోర్టు తీర్పు రిజర్వ్

By Mahesh KFirst Published Feb 9, 2023, 6:25 PM IST
Highlights

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎంఏ డిగ్రీ గురించిన ఓ పిటిషన్ పై గుజరాత్ హైకోర్టులో తీర్పు రిజర్వ్‌లో పెట్టింది. గుజరాత్ యూనివర్సిటీ సీఐసీ ఆదేశాలను సవాల్ చేస్తూ వేసిన ఈ పిటిషన్ పై హైకోర్టు రెండు పక్షాల వాదనలు విని తీర్పు రిజర్వ్‌లో ఉంచింది.
 

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎంఏ డిగ్రీకి సంబంధించిన కేసుపై గుజరాత్ హైకోర్టు తీర్పు రిజర్వ్‌లో ఉంచింది. పీఎం మోడీ డిగ్రీని బహిరంగపరచాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆర్టీఐ దాఖలు చేశారు. ఈ ఆర్టీఐకి సమాధానం ఇవ్వడానికి ప్రధాని మోడీ డిగ్రీ వివరాలను అరవింద్ కేజ్రీవాల్‌కు అందించాలని సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ (సీఐసీ) గుజరాత్ యూనిర్సిటీకి ఆదేశాలు పంపింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ గుజరాత్ యూనివర్సిటీ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించింది. గుజరాత్ యూనివర్సిటీ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఇరువైపుల వాదనలు విన్నది. తీర్పు రిజర్వ్‌లో పెట్టింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ బహిర్గతం చేయాలని అరవింద్ కేజ్రీవాల్ సీఐసీకి లేఖ రాశారు. ప్రధాని మోడీ డిగ్రీ వివరాలను ప్రజల ముందు ఉంచితే అతని చదువులపై నెలకొన్న అనుమానాలు తొలగిపోతాయని కోరారు. గుజరాత్ యూనివర్సిటీ పిటిషన్ పై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహెతా, కేజ్రీవాల్ తరఫు న్యాయవాది సీనియర్ అడ్వకేట్ పెర్సీ కావినా వాదించారు.

ప్రధాని మోడీ డిగ్రీ బహిరంగంగానే ఉన్నదని, కానీ, ఆర్టీఐ కింద మూడో వ్యక్తికి డిగ్రీని వెల్లడించాల్సిన అవసరం లేదని మెహెతా వాదించారు. యూనివర్సిటీలను డిగ్రీలు బహిరంగ పరిచేలా ఒత్తిడి పెట్టాల్సిన అవసరం లేదని, ముఖ్యంగా దానితో ప్రజా ప్రయోజనం లేనప్పుడు అది అవసరమే లేదని మెహతా పేర్కొన్నారు. అంతేకాదు, ఆర్టీఐ కింద ప్రజా కార్యకలాపానికి అవసరమైతేనే వ్యక్తిగత వివరాలను బయటకు వెల్లడించాల్సి ఉంటుందని అన్నారు. లేదా స్వయంగా ఆ వ్యక్తే తన డిగ్రీని సదరు యూనివర్సిటీ నుంచి బహిరంగ పరచాలని డిమాండ్ చేస్తే అప్పుడు వెల్లడించవచ్చని వివరించారు.

Also Read: Valentines Day 2023: ఎఫైర్‌లు పెట్టుకునే కాలంలో కరెంట్ ఎఫైర్స్ చదువుతున్నా.. తేజస్వీకి పింకీ లవ్ లెటర్.. వైరల్

కాగా, కేజ్రీవాల్ తరఫు న్యాయవాది పెర్సీ కావినా వాదిస్తూ ప్రధానమంత్రి కార్యాలయం పీఐవోకు డైరెక్షన్స్ వెళ్లినప్పుడు గుజరాత్ యూనివర్సిటీ ఎందుకు కోర్టును ఆశ్రయించిందని అడిగారు. ఒక వేళ ఆ ఆదేశాలను సవాల్ చేయాలని అనుకుంటే పీఎంవో పీఐవో ఆ పని చేయాలని పేర్కొన్నారు. ఎన్నికల బరిలోకి దిగే లేదా దిగిన అభ్యర్థి ఆయన విద్యా అర్హతలను బహిరంగం చేయడం చట్ట ప్రకారం తప్పనిసరి అని వాదించారు.

click me!