దళితుడితో కూతురు ప్రేమ వివాహం.. కుటుంబం మొత్తం సామూహిక ఆత్మహత్యాయత్నం

Siva Kodati |  
Published : Sep 06, 2023, 03:13 PM IST
దళితుడితో కూతురు ప్రేమ వివాహం.. కుటుంబం మొత్తం సామూహిక ఆత్మహత్యాయత్నం

సారాంశం

కుమార్తె దళిత వ్యక్తిని పెళ్లి చేసుకుందనే మనస్తాపంతో గుజరాత్‌లో ఓ కుటుంబం సామూహికంగా అత్మహత్యాయత్నానికి పాల్పడింది. విషం సేవించిన విషయాన్ని గమనించిన స్థానికులు ఇరుగుపొరుగు వారు అంబులెన్స్‌కు ఫోన్ చేసి, పోలీసులకు సమాచారం అందించారు.

కుమార్తె దళిత వ్యక్తిని పెళ్లి చేసుకుందనే మనస్తాపంతో గుజరాత్‌లో ఓ కుటుంబం సామూహికంగా అత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అహ్మదాబాద్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. కూతురి ప్రేమ వివాహంతో దంపతులు , వారి ఇద్దరు కుమారులు విషం తాగారు. ఏడాది క్రితం వీరి కుమార్తె దళిత వర్గానికి చెందిన వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకోవాలని తీసుకున్న నిర్ణయాన్ని వీరు జీర్ణించుకోలేకపోయారు. కుమార్తె నిర్ణయంతో వారు సంతోషంగా లేరని, ఈ క్రమంలోనే బలవన్మరణానికి పాల్పడ్డారని ఢోల్కా పోలీస్ స్టేషన్ అధికారి ఒకరు చెప్పారు. 

ధోల్కా పట్టణానికి చెందిన కిరణ్ రాథోడ్ (52), అతని భార్య నీతా బెన్ (50), వారి ఇద్దరు కుమారుడు హర్ష్ (24), హర్షిల్ (19)లు మంగళవారం విషపూరితమైన పదార్ధాన్ని తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇంటి పెద్ద, అతని పెద్ద కుమారుడు ప్రాణాలు కోల్పోగా.. తల్లి, చిన్న కుమారుడు ప్రాణాలతో బయటపడ్డారు. 

వీరు విషం సేవించిన విషయాన్ని గమనించిన స్థానికులు ఇరుగుపొరుగు వారు అంబులెన్స్‌కు ఫోన్ చేసి, పోలీసులకు సమాచారం అందించారు. ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణలపై రాథోడ్ కుమార్తె అత్తమామలు సహా 18 మందిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. 

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?