భారత్ లో కరోనా మహమ్మారి తన కోరలు చాస్తోంది. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాణిని కలిసిన కొన్ని గంటల తర్వాతే... ఆ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే కరోనా పాజిటివ్ గా తేలారు. దీనితో ఇప్పుడు ఒక్కసారిగా గుజరాత్ శాసనసభ్యులందరిలో, ముఖ్యంగా ముఖ్యమంత్రితో సహా ఆ సదరు ఎమ్మెల్యేతో క్లోజ్ గా ఉన్న అందరిలో భయాందోళనలకు గురవుతున్నారు.
ముఖ్యమంత్రితో మీటింగ్ తో పాటుగా ఈ సదరు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖేడావాలా ముఖ్యమంత్రి మీటింగ్ తో మాటుగా ఇతర ఎమ్మెల్యేలతో కలిసి ప్రెస్ మీట్లో కూడా పాల్గొన్నాడు. జమల్పూర్ ఖాదియా కు చెందిన ఈ ఎమ్మెల్యే గత కొంత కాలంగా జ్వరంతో బాధపడుతుండడం వల్ల టెస్టింగ్ కోసం తన సాంపిల్స్ ని ఇచ్చాడు.
విషయం తేలడంతో ఆయనను అహ్మదాబాద్ లో కరోనా కోసం ప్రత్యేకంగా ఆలౌట్ చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ హాస్పిటల్ లో చేర్చారు. ఇప్పటికిప్పుడు ఆ ఎమ్మెల్యేతోపాటుగా ఉన్న ఎంతమందిని క్వారంటైన్ కి తరలించాలనే ఒక నిర్ణయానికి రాలేదని, ప్రస్తుతం అదే పనిలో అధికార యంత్రాంగం అంతా నిమగ్నమయి ఉందని అధికారులు తెలిపారు.
ఉదయం ఈ సదరు ఎమ్మెల్యే అటెండ్ అయిన మీటింగ్ లో అందరూ కూడా సోషల్ డిస్టెన్సిన్గ్ పాటిస్తూ కూర్చున్నారన్న విషయం సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా తేలడంతో అధికారులు ఒకింత ఊపిరి పీల్చుకున్నప్పటికీ ఈ పరిస్థితిపై ఎలా ముందుకెళ్లాలి అర్థం కాక అందరూ తలలు బద్దలు కొట్టుకుంటున్నారు.
లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ, మహారాష్ట్ర, గుజరాత్లలో ఇన్ఫెక్షన్ వ్యాప్తి అంతలా తగ్గినట్టు మాత్రం డేటా ద్వారా తేలలేదని కొన్ని ఇంగ్లీష్ మీడియా చానెళ్లు అభిప్రాయపడ్డాయి.
ఇకపోతే నిన్న ప్రధాని నరేంద్ర మోడీ గారు మాటలాడుతూ, ప్రజలను ఈ కరోనా పై పోరులో తన తోడు రావాలని పిలుపునిచ్చారు. కరోనా మహమ్మారిపై ఇన్ని రోజులు ప్రభుత్వానికి సహకరించిన ప్రజలు మరో ఏడూ సూత్రాలు పాటిస్తామని మాటివ్వాలని కోరారు.
1. వయసు పైబడినవారిని కాపాడుకోవాలి. ఇంట్లోని వృద్దులపట్ల ప్రత్యేక శ్రద్ద చూపాలని, గతంలో రోగాల బారిన పడిన హిస్టరీ ఉన్నా, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నవారికి కాపాడుకోవాలి. .
2. లాక్ డౌన్, సోషల్ డిస్టెన్సింగ్ అనే లక్ష్మణ రేఖలను పాటించాలి.
3. పేస్ మాస్కును ధరించాలి, దానికోసం ఖర్చు చేయాల్సిన అవసరం లేదని, ఇంట్లో తయారుచేసిన ఫేస్ మాస్క్ లను వాడమని చెప్పారు.
3. రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన మార్గదర్శకాలను పాటించాలని సూచించారు.
4. కరోనా నియంత్రణకోసం రూపొందించిన ఆరోగ్య సేతు మొబైల్ యాప్ ని డౌన్ లోడ్ చేసుకోవాలని, ఇతరులను కూడా డౌన్ లోడ్ చేసుకునేందుకు ప్రోత్సహించాలని ప్రధాని పిలుపునిచ్చారు.
5. పేదలకు ప్రతిఒక్కరు ఈ సంకట సమయంలో చేతనైనంత సహాయం చేయాలనీ సూచించారు.
6. సహ ఉద్యోగులపట్ల శ్రద్ద చూపడంతోపాటు, ఎవరిని కూడా ఉద్యోగాల నుంచి తీసేయవద్దు అని కోరారు.
7. ప్రభుత్వ అధికారులను, పోలీసులను, వైద్య సిబ్బందిని గౌరవించాలని మోడీ కోరారు.
ఈ సప్తపదిని పాటిస్తూ ప్రజలంతా ఈ కరోనా వైరస్ మహమ్మారిని పారద్రోలాలని, వీటిద్వారానే ఈ మహమ్మారి నుంచి మనం బయటపడవచ్చని మోడీ గారు తెలిపారు.