మతం మార్చుకొని మర్కజ్ వెళ్ళాడు... కరోనా పాజిటివ్ గా తేలాడు!

By Sree sFirst Published Apr 15, 2020, 10:32 AM IST
Highlights
ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్  హాజరయినవారిలో చాలా మందికి కరోనా వైరస్ సోకినా విషయం తెలిసిందే. తాజాగా నిజాముద్దీన్ మర్కజ్ కు ప్రార్థనల కోసం వెళ్లిన ఒక యువకుడికి కరోనా పాజిటివ్ అని తేలింది.
ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్  హాజరయినవారిలో చాలా మందికి కరోనా వైరస్ సోకినా విషయం తెలిసిందే. తాజాగా నిజాముద్దీన్ మర్కజ్ కు ప్రార్థనల కోసం వెళ్లిన ఒక యువకుడికి కరోనా పాజిటివ్ అని తేలింది. చాలా మందికి తేలింది, ఇందులో ఏముంది మరో కరోనా కేసు లాగ అనిపించినప్పటికీ... ఈ యువకుడు ఆరు నెలల క్రితమే మతం, మార్చుకొని ఇస్లాం మతాన్ని స్వీకరించాడు. 

వివరాల్లోకి వెళితే... ఉత్తరప్రదేశ్ లోని సంత్ కబీర్ నగర్ జిల్లాకు చెందిన దుధార పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ సదరు పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామానికి చెందిన యువకుడు మర్కజ్ కు వెళ్లి వచ్చాడు. వెళ్లి వచ్చిన తరువాత అతనిలో కరోనా లక్షణాలు బయటపడడంతో ఆసుపత్రికి వెళ్ళాడు. 

అతడ్ని పరీక్షించిన డాక్టర్లు టెస్టులకు అతడి సాంపిల్స్ ని ల్యాబ్ కి పంపించారు. అక్కడ అతనికి కరోనా పాజిటివ్ అని తేలడంతో అతడికి సీతాపూర్ ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు.  ఇతిహాదు ఎవరెవర్ని కలిశారు అని పోలీసులు ఎంక్వయిరీ చేయగా ఆ ఇంక్విరీలో ఇతడు ఆరు నెలల క్రితం ఇస్లాం మతాన్ని స్వీకరించి ముస్లింగా మారాడనే విషయం తెలియవచ్చింది. 

ఈ వ్యక్తి ఎవరెవర్ని కలిసాడు అనే విషయాలపై ఆరా తీసిన అధికారులు వారందరిని చాలా వరకు క్వారంటైన్ కి తరలించారు. లక్షణాలుంటే వెంటనే ఐసొలేషన్ వార్డ్ కి తరలించనున్నట్టు తెలిపారు. ఆ గ్రామం, అతడి ట్రావెల్ హిస్టరీని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. 

యూపీలో కూడా అంతకంతకు కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇక మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే... రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రాష్ట్రంలో కొత్తగా 47 కోత్త కేసులున నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో కోవిడ్ -19తో అట్టుడుకుతోంది. గుంటూరు జిల్లాలో కొత్తగా 21 కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 114కు చేరుకుంది. రాష్ట్రంలో అత్యధికంగా కోవిడ్ -19 కేసులు గుంటూరు జిల్లాలోనే నమోదయ్యాయి. 

ఆ తర్వాత స్థానం కర్నూలు జిల్లా అక్రమించింది. రాష్ట్రంలో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 486కు చేరుకుంది. సోమవారం రాత్రి 10 గంటల నుంచి మంగళవారం రాత్రి 8 గంటల వరకు గుంటూరు జిల్లాలో 21, కృష్ణాలో 8, కర్నూలు జిల్లాలో 9, అనంతపురం జిల్లాలో 6, కడప జిల్లాలో 2, ప్రకాశం ఒక కేసు నమోదయ్యాయి. గుంటూరు జిల్లా కేసుల్లో గుంటూరు నగరంలోనే 14 కేసులు నమోద్యయాయి.

రాష్ట్రంలో ఇప్పటి వరకు 16 మందికి కరోనా వ్యాధి నయమై ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 9 మంది మరణించారు. 458 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

విజయవాడకు చెందిన 55 ఏళ్ల వ్యక్తి ఈ నెల 12వ తేదీన మరణించాడు. ఆయన ఈ నెల 5వ తేదీన సర్వజనాస్పత్రిలో చేరాడు. అతనికి మధుమేహం, ఆస్తమా ఉన్నాయి. పంజాబ్ నుంచి వచ్చిన వ్యక్తితో సన్నిహింతగా ఉండడం వల్ల అతనికి కరోనా సోకింది. 

నెల్లూరు జిల్లాకు చెందిన వైద్యుడు ఈ నెల 13వ తేదీన కోవిడ్ వ్యాధికి చెన్నైలో చికిత్స పొందుతూ మరణించాడు. ఢిల్లీ నుంచి వచ్చిన కరోనా రోగితో సన్నిహితంగా మెలగడం వల్ల అతనికి కరోనా వైరస్ సోకింది.   
click me!