గుడియా రేప్, హత్య కేసులో ఢిల్లీ కోర్టు సంచలన తీర్పు

By telugu teamFirst Published Jan 18, 2020, 5:25 PM IST
Highlights

గుడియా రేప్, హత్య కేసులో ఇద్దరు నిందితులను ఢిల్లీ కోర్టు దోషులుగా నిర్ధారించింది. వారికి ఈ నెల 30వ తేదీన శిక్షను ఖరారు చేయనుంది. ఏడేళ్ల క్రితం ఇద్దరు వ్యక్తులు గుడియాను కిడ్నాప్ చేసి ఆమెపై అత్యాచారం చేశారు.

న్యూఢిల్లీ: గుడియా రేప్, హత్య కేసులో ఢిల్లీ కర్కర్డూమా కోర్టు శనివారం సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులోని ఇద్దరు నిందితులను దోషులుగా నిర్ధారించింది. ప్రదీప్, మనోజ్ ఇద్దరిని కూడా దోషులుగా నిర్ధారిస్తూ తీర్పు చెప్పింది. ఈ నెల 30వ తేదీన వారికి శిక్షను ఖరారు చేయనుంది.

ఏడేళ్ల క్రితం 2013 ఏప్రిల్ 15వ తేదీన పక్కింటి వ్యక్తి, అతని మిత్రుడు ఐదేళ్ల బాలికను అపహరించి, ఆమెపై అత్యాచారం చేశారు. ఈ సంఘటన ఢిల్లీలోని గాంధీనగర్ లో జరిగింది. ఆమె ప్రైవేట్ భాగాల్లోకి ఇతర వస్తువులను చొప్పించారు. దాంతో విపరీతమైన రక్తస్రావం జరిగింది.

అపహరణకు గురైన రెండు రోజుల తర్వాత బాలిక అత్యంత దయనీయమైన స్థితిలో కనిపించింది. ఏప్రిల్ 16వ తేదీ పక్కింటిలో ఆమె కనిపించింది. స్పృహ కోల్పోయిన బాలికను ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేర్చారు. 

రేప్, హత్యాప్రయత్నంతో పాటు ఇతర అభియోగాలు మోపుతూ ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. బీహార్ లోని అత్తారింటిలో పోలీసులు మనోజ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. రెండో నిందితుడిని ఆ తర్వాత అదుపులోకి తీసుకున్నారు. 

click me!