అవసరమైతే ప్రత్యేక చట్టాలు చేసుకోవచ్చు: జీఎస్టీపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Published : May 19, 2022, 01:25 PM ISTUpdated : May 19, 2022, 01:47 PM IST
అవసరమైతే ప్రత్యేక చట్టాలు చేసుకోవచ్చు: జీఎస్టీపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

సారాంశం

జీఎస్టీ కౌన్సిల్ సిఫారసులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడాల్సిన అవసరం లేదని  సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది,. అవసరమైతే ప్రత్యేకంగా ఆయా రాష్ట్రాలు, పార్లమెంట్ చట్టాలు చేసుకోవచ్చని కూడా సూచించింది. 

న్యూఢిల్లీ: GSTపై గురువారం నాడు Supreme Court సంచలన తీర్పును ఇచ్చింది.   జీఎస్టీ కౌన్సిల్ సిఫారసులకు  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అవసరం అనుకుంటే  Parliament, రాష్ట్రాల Assembly లు ఈ విషయమై వేర్వేరు చట్టాలు కూడా చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.

కేంద్ర, రాష్ట్రాలకు సమాన అధికారులున్నాయని సుప్రీంకోర్టు తెలిపింది.పన్నుల విషయంలో 246 ఏ ప్రకారంగా కేంద్రం,రాష్ట్రం సమానమేనని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. ఒకరి ఆదేశాలను మరొకరిపై బలవంతంగా రుద్దొద్దని కూడా ఉన్నత న్యాయస్థానం కోరింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలు అవసరమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. 

also read:GST Filing: వ్యాపారులకు ఊరట.. ఏప్రిల్ నెల జీఎస్టీ రిటర్న్ తేదీ మే 24 వరకూ పొడిగింపు

ఆర్టికల్ 246ఎ, 279 లను సుప్రీంకోర్టు ప్రస్తావించింది. నిబంధనలు పన్నుల విషయాలపై చట్టాలు చేయడానికి రాష్ట్రాలు, కేంద్రాలకు సమాన అధికారులు ఉన్నాయని గుర్తు చేసింది. డివై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ తీర్పును ఇవాళ వెల్లడించింది.  కోఆపరిటివ్ పెడరలిజం సూత్రాలను కోర్టు తీర్పు హైలెట్ చేసింది.జీఎస్టీ 2007 ప్రకారంగా సముద్ర రవాణాపై పన్ను విధించడానికి సంబంధించి గుజరాత్ హైకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా దాఖలు చేసిన అప్పిల్ పై సుప్రీంకోర్టు ఈ తీర్పును వెలువరించింది. 

జీఎస్టీ 2007 ప్రకారంగా సముద్ర రవాణాపై పన్ను విధించడానికి సంబంధించి గుజరాత్ హైకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా దాఖలు చేసిన అప్పిల్ పై సుప్రీంకోర్టు ఈ తీర్పును వెలువరించింది.  ఓడలో వస్తువుల రవాణా సేవలపై 5 శాతం ఐజీఎస్టీ విధించాలని 2017 ప్రభుత్వం నోటిపికేషన్ ను హైకోర్టు రద్దు చేసింది. హైకోర్టు తీర్పును ఇవాళ సుప్రీంకోర్టు సమర్ధించింది.

మోహిత్ మినరల్స్ ప్రైవేట్ లిమిటెడ్ , కేంద్ర ప్రభుత్వం  మధ్య జరిగిన కేసులో హైకోర్టు ఈ తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించింది.  రివర్స్ చార్జీ కింద సముద్రపు సరుకు రవాణాపై దిగుమతిదారులపై కూడా ఐజీఎస్టీ విధించడాన్ని గుజరాత్ హైకోర్టు 2020లో రద్దుచేసింది. ఇదే తీర్పును ఇవాళ సుప్రీంకోర్టు సమర్ధించింది. కేంద్ర ప్రభుత్వం 2017 జూన్ లో  నోటిఫికేషన్ 8 ద్వారా నౌకలో వస్తువుల రవాణా సేవపై 5 శాతం ఐజీఎస్టీని విధించింది. ఈ నోటిఫికేషన్ ను హైకోర్టు రద్దు చేసింది.

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌