రేపటి జీఎస్ఎల్‌వీ ఎఫ్-10 ప్రయోగం వాయిదా

By Siva KodatiFirst Published Mar 4, 2020, 4:49 PM IST
Highlights

గురువారం ప్రయోగించాల్సిన జీఎస్ఎల్‌వీ ఎఫ్-10 ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రకటించింది. సాంకేతిక కారణాలతోనే ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్లు ఇస్రో తెలిపింది.

గురువారం ప్రయోగించాల్సిన జీఎస్ఎల్‌వీ ఎఫ్-10 ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రకటించింది. సాంకేతిక కారణాలతోనే ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్లు ఇస్రో తెలిపింది.

ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం గురువారం సాయంత్రం 5.43 నిమిషాలకు శ్రీహరి కోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ రెండో ప్రయోగ వేదిక నుంచి రాకెట్ నింగిలోకి దూసుకెళ్లాల్సి ఉంది.

Also Read:చంద్రయాన్‌-3 పనులు మొదలుపెట్టాం, గగన్‌యాన్ కూడా: ఇస్రో ఛైర్మన్ శివన్

ఈ రాకెట్ ద్వారా 2,268 కిలోల జీఐశాట్-1 ఉపగ్రహాన్ని భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. భూమిని పరిశోధించేందుకు ఇప్పటి వరకు రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్‌ను భూమికి 506-830 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న సూర్యానువర్తన ధృవ కక్ష్యలోకి మాత్రమే పంపేవారు.

అయితే ఈ సారి తొలిసారిగా జియో ఇమేజింగ్ శాటిలైట్ పేరుతో రిమోట్ సెన్సింగ్ శాటిలైట్‌ను మొట్టమొదటి సారిగా భూ స్థిర కక్ష్యలోకి పంపి పనిచేసే విధంగా ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించడం విశేషం.

Also Read:గగన్‌యాన్ వ్యోమగాముల కోసం హల్వా, వెజ్ బిర్యానీ: స్పేస్‌లో ఎలా తింటారంటే..!!

దీని తర్వాత జూలైలో జీఎస్ఎల్‌వీ ఎఫ్-12 రాకెట్ ద్వారా జీఐశాట్-2 రెండో ఉపగ్రహాన్ని కూడా పంపేందుకు ఇస్రో రెడీ అవుతోంది. దేశ భద్రతా అవసరాలు, రక్షణ వ్యవస్థతో అనుసంధానం, విపత్తులు సంభవించినప్పుడు ముందుస్తు సమాచారాన్ని తెలుసుకునేందుకు ఈ రెండు భారీ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించనుంది. 

click me!