పెండ్లి వేడుకలో షారుఖ్ ఖాన్.. వధువుకు సర్ ప్రైజ్ ఇచ్చిన వరుడు.. వైరల్ వీడియో

Published : Mar 11, 2023, 08:38 PM IST
పెండ్లి వేడుకలో షారుఖ్ ఖాన్.. వధువుకు సర్ ప్రైజ్ ఇచ్చిన వరుడు.. వైరల్ వీడియో

సారాంశం

Viral video: వివాహ వేడుకకు సంబంధించిన మధుర  క్షణాలు వధువరులకు మాత్రమే కాదు వారి కుటుంబ సభ్యులు, బంధువులకు జీవితకాలపు జ్ఞాపకాలుగా ఉంటాయి. ఆ సమయంలో వధువరుల స్నేహితులు, కుటుంబ సభ్యులు, వారి బంధువులు ఇచ్చే ప్రదర్శనలు, సర్ ప్రైజ్ లు అందరినీ ఆనందంలో ముంచెత్తడంతో పాటు ఆశ్చర్యపరుస్తుంటాయి. 

Groom surprises his bride with special message: వివాహ వేడుకకు సంబంధించిన మధుర  క్షణాలు వధువరులకు మాత్రమే కాదు వారి కుటుంబ సభ్యులు, బంధువులకు జీవితకాలపు జ్ఞాపకాలుగా ఉంటాయి. ఆ సమయంలో వధువరుల స్నేహితులు, కుటుంబ సభ్యులు, వారి బంధువులు ఇచ్చే ప్రదర్శనలు, సర్ ప్రైజ్ లు అందరినీ ఆనందంలో ముంచెత్తడంతో పాటు ఆశ్చర్యపరుస్తుంటాయి. ఒక్కోసారి వధువరులు కూడా ఒకరికొకరు సర్ ప్రైజ్  ప్రదర్శనలు ఇచ్చి అందరి మనసులు గెలుచుకుంటారు. ఈ నేపథ్యంలోనే ఓ పెండ్లి వేడుకకు సంబంధించి వీడియో వైరల్ గా మారింది. ఓ వరుడు తన వధువు (కాబోయే భార్య) కోసం ప్రత్యేకంగా చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తనకు కాబోయే భార్యకోసం చేసిన ఈ పనిపై సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఆ వ‌రుడు ఏం చేశాడంటే.. 

పెండ్లి వేడుక‌లో వ‌రుడు తన డ్యాన్స్ ప్రదర్శనకు ముందు తన వధువు కోసం నటుడు షారుఖ్ ఖాన్ ఇచ్చిన ప్రత్యేక వాయిస్ నోట్ ను ప్లే చేశాడు. ఈ వీడియోను డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లానర్లు అయిన‌ ది క్రిమ్సన్ సర్కిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఆ దృశ్యాల్లో స్టేజ్ మీద స్క్రీన్ పై చూపించే స్మార్ట్ ఫోన్ తో షార్ట్ క్లిప్ మొదలవుతుంది. ఫోన్ స్క్రీన్ పై 'కింగ్ ఖాన్' ఫొటో, 'షారుక్ కాలింగ్' అని మెసేజ్ ఉంది. ఫోన్ లిఫ్ట్ చేసిన‌ట్టు ప్లే చేసిన త‌ర్వాత‌.. షారుఖ్ ఖాన్ త‌న వాయిస్ తో 'హాయ్ కిన్నారి, హాయ్ సంజీత్. నేను మీ షారుఖ్. మీకు పెళ్లి రోజు శుభాకాంక్ష‌లు.. మీ జీవితాంతం కలిసి గొప్ప సమయాన్ని గడపాలని కోరుకుంటున్నాను. ఇన్షా అల్లా..  మీరు చాలా సంతోషంగా ఉంటారు. మరోసారి హ్యాపీ వెడ్డింగ్" అని అన్నారు. ఈ వీడియోలో ప్రజలు హర్షధ్వానాలు, కేరింతలు కొడుతున్నారు. ఆ తర్వాత 'దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే' చిత్రంలోని రుక్ జా ఓ దిల్ దివానే పాట‌కు  వరుడు డ్యాన్స్ చేశాడు.

 

ఈ వీడియో షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 6 లక్షలకు పైగా వ్యూస్, 65 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.  'నా కాబోయే భర్త ఇలా నన్ను ఆశ్చర్యపరచకపోతే నేను పెళ్లి చేసుకోను' అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు